Home » Music director raj: తన చివరి కోరిక తీరకుండానే రాజు మరణించాడా..?

Music director raj: తన చివరి కోరిక తీరకుండానే రాజు మరణించాడా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది, నటులు చనిపోతున్నారు. ఆ మధ్య కాలంలో వరుసగా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, చలపతిరావు, కైకల సత్యనారాయణ, నందమూరి తారకరత్న, ఇలా స్టార్స్ అంతా ఒక్కొక్కరిగా ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. అయితే తాజాగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ రాజు గుండెపోటుతో హైదరాబాదులో మరణించారు. ఆయన పూర్తి పేరు తోటకూర సోమరాజు. ఆయన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన బానిలతో ఆకట్టుకున్నారు. రాజ్ కోటీతో ఒకరైన రాజ్ మరణం తెలిసిన సినీ ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు.

Advertisement

అయితే మ్యూజిక్ డైరెక్టర్ రాజు మరణించడంతో కోటి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నా ఫ్రెండ్ చనిపోయాడనే వార్త తట్టుకోలేక పోతున్నాను, ఈమధ్య ఒక సినిమా ఫంక్షన్ లో కలుసుకున్నాం. ఇలాంటి సమస్యలు ఉన్నట్టు నాకు అనిపించలేదు. రాజ్ కోటిగా మేమిద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. ఎన్నో బ్లాక్ ప్లాస్టర్ హిట్స్ అందుకున్నాం.

Advertisement

మేమిద్దరం విడిపోయిన తర్వాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా కానీ రాజ్కోటి పాటలు అనేవారు. అంటూ కోటి ఆవేదన వ్యక్తం చేశారు. రాజు నాకు అన్న లాంటివాడు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. రాజు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు. మనిద్దరం మరణించే వరకు కలిసి ఉండాలని కోరుకునే వాడు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరం విడిపోవలసి వచ్చింది. మా పాటల రూపంలో రాజు ఎప్పటికీ బతికే ఉంటాడని కోటి అన్నారు.

మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading