Home » సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం..!

సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం..!

by Anji
Ad

ప్రముఖ సంగీత దర్శకుడు, రచయిత ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె సింగర్ భవతారణి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. కొద్ది రోజులుగా ఆమె క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. అయితే ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం  లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం వెళ్లినట్టు తెలుస్తోంది.  చికిత్స పొందుతూనే ఇవాళ సాయంత్రం 5 గంటల సమయంలో శ్రీలంకలోనే మరణించినట్టు సమాచారం.

Advertisement

Advertisement

ఆమె భౌతిక కాయాన్ని రేపటి లోపు చెన్నైకి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఆమె మరణవార్త తెలిసిన పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇళయరాజా కూతురు భవ తారణి కూడా పలు సినిమాల్లో పాటలు పాడారు.

Visitors Are Also Reading