Home » ఫ్లాట్ లో సమంత నాగచైతన్యలు అలా ఉండేవారు… మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఫ్లాట్ లో సమంత నాగచైతన్యలు అలా ఉండేవారు… మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత నాగచైతన్యవిడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ లో వీరిద్దరు విడాకులు తీసుకోగా ఇప్పటికీ వీరి విడాకుల గురించి అనేక వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక తాజాగా నటుడు మురళీమోహన్ సమంత నాగచైతన్య విడాకులు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మురళీమోహన్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే మురళీమోహన్ తన కుమారుడి కోసం మరియు కుటుంబం కోసం ఒకే రకంగా ఉన్న రెండు ఇళ్ళను నిర్మించారట. ఒకరోజు మురళీమోహన్ ఇంటికి వెళ్లిన నాగచైతన్యకు ఆ ఫ్లాట్ చాలా నచ్చిందట. దాంతో చైతూ మురళీమోహన్ ను తనకు ఆ ఫ్లాట్ ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. కానీ తాను ఫ్యామిలీ కోసం నిర్మించుకోవడంతో నో చెప్పానని అన్నారు. దాంతో చైతు ఇంటికి వెళ్లి నాగార్జునతో ఫోన్ చేయించాడని నాగార్జున ఫోన్ చేసి మా చైతూ కు ఒక పట్టాన ఏవి నచ్చవు వాడికి మీ ఇల్లు బాగా నచ్చిందట అని చెప్పగానే ఇచ్చేసానని అన్నారు.

Advertisement

ఇక కింద ఫ్లాట్ లో తాను ఉండేవాడినని పైన చైతు సమంతలు ఉండేవారని మురళీమోహన్ చెప్పాడు. అందులోనే జిమ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉండేవని తెలిపారు. ఇక ఆ ఇంట్లో చిన్న శబ్దమైనా తనకు వినిపించేదని అన్నారు. స్పూన్ పడిన శబ్దం కూడా వినిపించే మాదిరిగా ఆ ఫ్లాట్ ఉండేదని చెప్పారు. పెళ్లి తర్వాత సమంత నాగచైతన్య అందులోనే కాపురం పెట్టారని అన్నారు. ఆ ఫ్లాట్ లో సమంత చైతూ ఉన్నన్ని రోజులు ఎంతో ఆప్యాయంగా ఉన్నారని తెలిపారు. సాధారణంగా స్టార్ హీరో హీరోయిన్ అంటే స్నేహితులను తీసుకువచ్చి పార్టీలు చేసుకుంటూ హంగామా చేస్తారు కానీ వాళ్ళిద్దరూ ఏ రోజు కూడా అలా చేయలేదని చెప్పారు. ప్రతిరోజు ఉదయం సమంత జిమ్ చేసేదని అన్నారు. నాగచైతన్య సమంత కలిసి ప్రతిరోజు ఆరు బయట వాకింగ్ ప్లేస్ లో కొద్దిసేపు నడిచేవారు అని తెలిపారు.

ఎప్పుడు చూసినా చక్కగా మాట్లాడుకుంటూ ఎంతో అన్యోన్యయంగా కనిపించే వారిని మురళీమోహన్ వెల్లడించారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు తాను ఎప్పుడూ వినలేదని చూడలేదని అన్నారు. ఒకరోజు పనిమనిషి వచ్చి వాళ్ళిద్దరూ విడిపోతున్నారు నాగచైతన్య ఫ్లాట్ కాళీ చేసి వెళ్లిపోయారని చెప్పగానే షాక్ అయ్యానని అన్నారు. ఈ విషయం ముందే తెలిసినా నాగార్జునతో మాట్లాడి ఉండేవాడినని తెలిపారు. చక్కగా కలిసిమెలిసి ఉండే వాళ్ళిద్దరూ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తనకు అర్థం కాలేదని చెప్పారు.

Also read : అమితాబ‌చ్చ‌న్-బాల‌కృష్ణ‌ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ మూవీ వాయిదా ప‌డ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

Visitors Are Also Reading