Home » రషీద్ ఖాన్ విధ్వంసం.. అయినా ముంబైదే పై చేయి..!

రషీద్ ఖాన్ విధ్వంసం.. అయినా ముంబైదే పై చేయి..!

by Anji
Ad

ఐపీఎల్ 16వ సీజన్ లో వాంఖడే వేధికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ 103 అజేయమైన సెంచరీ సాధించాడు. దీంతో ముంబై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లనష్టానికి 218 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో 29 పరుగులు చేసిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత దక్కించుకున్నాడు.

Advertisement

ఇందులో 2 సిక్స్ లు బాది రోహిత్ శర్మ ముంబై తరుపున 200 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. అదేవిధంగా ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు  కొట్టిన రెండో ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు రోహిత్. ఇదిలా ఉంటే..  ముంబై విధించిన 219 పరుగుల లక్ష్య ఛేదనలో  103/8 13 ఓవర్లు ముగిసే వరకు గుజరాత్ స్కోరు. దీంతో గుజరాత్ కి భారీ ఓటమి తప్పదు అనుకున్నారు అందరూ. కానీ అప్గానిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ పరిస్థితిని తారుమారు చేశాడు. రన్స్ తీయడం వేస్ట్ అనుకున్నాడేమో కేవలం సిక్సర్లు, ఫోర్లతోనే పరుగులు సాధించాడు.

Manam News

Advertisement

ఓ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ మాదిరిగా బౌలర్లను చితకబాదాడు. 32 బంతుల్లోనే కేవలం 79 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 10 సిక్సర్లు నమోదు చేశాడు. 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగినర రషీద్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ తో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగలిగింది గుజరాత్. దీంతో కేవలం 27 పరుగుల తేడాతో మాత్రమే ఓటమిపాలైంది. రషీద్ తరువాత డేవిడ్ మిల్లర్ 41 మాత్రమే రాణించారు. మిగతా ఆటగాళ్లు అందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఈ విజయంతో ముంబై ప్లే ఆప్స్ కి మరింత చేరువ అయింది. ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతుంది. అంతకు ముందు బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ 4 వికెట్లు కూడా తీయడం విశేషం. 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :

వేణుమాధవ్‌, ఉదయభాను మధ్యలో ఉన్న ఈ కమెడియన్‌ ఎవరో గుర్తుపట్టారా?

ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు… లక్ష జీతం

Sunisith : Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

Visitors Are Also Reading