ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 టోర్నమెంటు ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే వార్త చెక్కర్లు కొడుతోంది. అయితే.. ఐపీఎల్ 2024 టోర్నమెంట్ కంటే ముందు గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై కొనుగోలు చేసుకుంది. రిటైన్ ప్రక్రియలో భాగంగా… హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్.
హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేయడమే కాకుండా…. ముంబై జట్టు కెప్టెన్గా అతన్నే ప్రకటించింది యాజమాన్యం. దీంతో ముంబై యాజమాన్యంపై అలాగే హార్దిక్ పాండ్యా పై దారుణంగా ట్రొలింగ్ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా చాలామంది ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో హార్దిక్ పాండ్యా విషయంపై ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కోసం అంబానీ కుటుంబం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
Advertisement
హార్దిక్ పాండ్యా కోసం అంబానీ కుటుంబం ఏకంగా 100 కోట్లు గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. బదిలీ రుసుముగా ఈ డబ్బు చెల్లించినట్లు సమాచారం. అయితే ముంబై ఇండియన్స్ కచ్చితంగా ఎంత సొమ్ము చెల్లించిందని విషయం ఐపీఎల్ నిర్వాహకులకు మాత్రమే తెలుసు. 2025లో ఐపీఎల్ మెగా వేలం ఉండటంతో ముందస్తు వ్యూహం లో భాగంగానే ముంబై ఇంత భారీ మొత్తం చెల్లించినట్లు సమాచారం అందుతుంది.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.