Home » 37 ఏళ్ల మ‌హిళ‌తో 27 ఏళ్ల యువ‌కుడు స‌హ‌జీవ‌నం….ఆరేళ్లు కూడా గ‌డ‌వ‌క‌ముందే..!

37 ఏళ్ల మ‌హిళ‌తో 27 ఏళ్ల యువ‌కుడు స‌హ‌జీవ‌నం….ఆరేళ్లు కూడా గ‌డ‌వ‌క‌ముందే..!

by AJAY
Ad

ముంబైలో దారుణం చోటు చేసుకుంది. త‌న‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్న మ‌హిళ‌నే యువ‌కుడు దారుణంగా హ‌త‌మార్చి ఆ త‌ర‌వాత ప‌రుపులో శ‌వాన్ని కుక్కాడు. ఆ ఇంటి నుండి దుర్వాస‌న రావ‌డంతో చుట్టుప‌క్క‌ల‌వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఈ ఘ‌ట‌న పై విచార‌ణ చేప‌ట్టారు. పోలీసుల విచార‌ణ‌లో ప్రేమించిన‌వాడే క‌సాయిగా మారి ప్రియురాలిని హ‌త‌మార్చాడ‌ని తెలిసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల్లోకి వెళితే….ముంబైలో 27 ఏళ్ల హార్దిక్ షా అనే యువ‌కుడు 37 ఏళ్ల మేఘ అనే మ‌హిళ కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు.

Advertisement

Advertisement

అంతే కాకుండా వీరిద్ద‌రూ ఆరు నెల‌లుగా ముంబైలో ఓ గ‌ది అద్దెకు తీసుకుని స‌హ‌జీవ‌నం కూడా చేస్తున్నారు. ఇక మేఘ ఓ ఆస్ప‌త్రిలో న‌ర్సుగా ప‌నిచేస్తుండ‌గా హార్దిక్ ప‌నీపాటా లేకుండా కాళీగా ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వలు జ‌రిగాయి. ఇటీవ‌ల ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు తీవ్ర‌త‌రం అయ్యాయి. దాంతో హార్దిక్ స‌హ‌నం కోల్పోయాడు.

అంతే కాకుండా మేఘ పై కోపంతో ర‌గిలిపోతూ ఆమెను హ‌త‌మార్చాడు. అనంత‌రం బాడీని ప‌రుపులో కుక్కి ఖ‌ర్చుల కోసం ఇంట్లోని వ‌స్తువును అమ్ముకుని వెళ్లిపోయాడు. చుట్టుప‌క్క‌ల వారికి దుర్వాస‌న రావ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నింధితుడిని అరెస్ట్ చేశారు.

Visitors Are Also Reading