టాలీవుడ్ లో 1990-2000 మధ్య కాలంలో ఎమ్ఎస్ రాజు స్టార్ నిర్మాతగా రాణించారు. హిట్టు మీద హిట్టు కొడుతూ వరుస కిట్లను అందుకున్నాడు. ఎమ్ ఎస్ రాజు నిర్మాతగా చేసిన సినిమాలలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వే, మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమా, విక్టరీ వెంకటేష్ హీరోగా నిర్మించిన దేవి సినిమాలు భారీ విజయాను సాధించాయి.
ఈ సినిమాలతో ఎం.ఎస్.రాజు తిరుగులేని నిర్మాతగా అవతరించారు. దాంతో అప్పట్లో ఎమ్.ఎస్ రాజు పేరు చూసే ప్రేక్షకులు సినిమాలకు వెళ్లేవారు కూడా. అయితే అలాంటి ఎమ్.ఎస్.రాజు కొన్ని ఫార్ములాల వల్ల ఫ్లాపులను కూడా అందుకున్నారు. వెంకటేష్ హీరోగా ఎమ్ ఎస్ రాజు నిర్మించిన దేవి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత అలాంటి టైటిల్ తోనే దేవి పుత్రుడు అనే సినిమా నిర్మించాడు.
Advertisement
Advertisement
కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అదేవిధంగా ఎం.ఎస్.రాజు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో రచయిత వీరుపోట్ల ఎమ్ఎస్ రాజుకు ఒక కథను వినిపించారు. అది ఓరుగల్లులోని అందమైన ప్రేమ కథ వర్షం. ఈ సినిమాకు శోభన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా త్రిష హీరోయిన్ గా నటించింది.
2004 జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎమ్ ఎస్ రాజు అదే మూడ్ లో ఉండి పోయారు. ఆ వెంటనే ఎమ్ఎస్ రాజు వాన అనే సినిమాను నిర్మించడంతో పాటు స్వీయ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వినయ్- మీరాచోప్రా లు హీరో హీరోయిన్లుగా నటించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. వర్షం సినిమా తో వచ్చిన లాభాలు ఈ సినిమా తో కొట్టుకుపోయాయి.
ALSO READ :
బ్రహ్మానందం జీవితం లో మరచిపోలేని ఆ ఘటన.. బ్రహ్మీ చేసిన పనికి వారి ఊరి ప్రజలు..!\
40 దాటినా పెళ్లి చేసుకోని స్టార్ హీరోయిన్లు..! లవ్ ఫెయిల్యూర్ వల్లేనా…?