IPL 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ సంచలన రికార్డు సృష్టించింది. ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్స్ గా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. వివరాల్లోకి వెళితే… ఐపిఎల్-2023 ఫైనల్ వేదిక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం… గుజరాత్ టైటాన్స్ సొంత మైదానం… వర్షం కారణంగా… లీగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రిజర్వ్ డేకు మ్యాచ్ వాయిదా… సీజన్ ఆరంభంలో ఇక్కడే చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి శుభారంభం చేసిన గుజరాత్…. ఫైనల్లోను అదే ఫలితం పునరావృతం చేసి వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవాలని భావించింది.
Advertisement
ఇక గుజరాత్ 214 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు సాయి సుదర్శన్. అయితే… మరోసారి వరుణుడి అడ్డంకి కారణంగా సీఎస్కే లక్ష్యం 15 ఓవర్లకు 171 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు. ఆ లక్ష్యాన్ని చెన్నై చేదించింది. అయితే మ్యాచ్ అనంతరం ఎమ్మెస్ ధోని సంచలన వాక్యాలు చేశారు. ఐపిఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇది సరైన సమయం. కానీ నేను రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధంగా లేనని వెల్లడించారు.
Advertisement
సీజన్ తొలి మ్యాచ్ లో అందరూ నా పేరును జపిస్తుంటే ఎమోషనల్ అయ్యాను. స్టేడియంలో అభిమానులు నా పేరును అరుస్తుంటే కళ్ళలో నీళ్లు నిండిపోయాయని వివరించారు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్లడం సులభం. కానీ మరో 9 నెలలు వెయిట్ చేసి ఐపీఎల్ ఆడటం కష్టమని… మీకోసం మరో ఐపీఎల్ ఆడటానికి ప్రయత్నిస్తాను… ఇది మీ అందరికీ గిఫ్ట్ గా ఉంటుంది… కానీ నా బాడీకి కష్టతరం అని ధోని చెప్పాడు. మీ ప్రేమను నేను ఇంకా ఆస్వాదించాలనుకుంటున్నానని వెల్లడించారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
ఈ రెండు లక్షణాలు ఉన్న భార్య దొరికితే.. ప్రతి మగాడి జీవితం పండగే
అభిమానినే పెళ్లి చేసుకున్న నటీనటులు వీళ్లే..
ఇతరుల చేతికి అస్సలు ఇవ్వకూడని వస్తువులు ఏంటో తెలుసా..?