Home » అత‌నిలా ఉండ‌లేను.. ధోనీకి నాకు చాలా పోలిక ఉంది డుప్లెసిస్

అత‌నిలా ఉండ‌లేను.. ధోనీకి నాకు చాలా పోలిక ఉంది డుప్లెసిస్

by Anji
Ad

ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీకి త‌న‌కు మ‌ధ్య పోలిక ఉంద‌న్నాడు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్. ధోనీ అద్భుత‌మైన సార‌థి అని, అత‌ని ప్ర‌యాణంలో భాగం కావ‌డం త‌న అదృష్టం అని చెప్పాడు. ఐపీఎల్ సార‌థిగా మాత్రం తాను ఎవ‌రినీ అనుక‌రించ‌బోను అని తెలిపాడు.

Also Read :  IND Vs SL 2nd Test : రిషబ్ పంత్ రికార్డు హాఫ్ సెంచరీ

Advertisement

కెరీర్‌లో అద్భుత‌మైన నాయ‌కుల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం నా అదృష్టం. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు గొప్ప కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌, ఆ త‌రువాత ప‌దేళ్ల పాటు ధోనీ, స్టీఫెన్ ప్లెమింగ్ లాంటి నాయ‌కుల సారథ్యంలో ఆడాను. ధోనీకి నాకు చాలా పోలిక‌లు ఉన్నాయి. ఇద్దం ప్ర‌శాంతంగా ఉంటాం. ద‌క్షిణాఫ్రికాలో ఉన్న ప‌రిస్థితుల వ‌ల్ల కెప్టెన్ అంటే నాకు ఓ ర‌క‌మైన అభిప్రాయ‌ముండేది. ధోనీ సారథ్యంలో సీఎస్‌కే లో ఆడిన త‌రువాత అది పూర్తిగా మారిపోయింది.

Advertisement

ప్ర‌తీ ఒక్క‌రి కెప్టెన్సీ వైవిద్యంగా ఉంటుంద‌ని.. ఎవ‌రి శైలిలో వారు ప్ర‌య‌త్నించాల‌ని అర్థ‌మైంది. ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు మ‌న‌లా మ‌నం ఉండ‌డ‌మే కీల‌కం. కోహ్లీలా, ధోనీలా ఉండాల‌ని నేను అనుకోను. వారి నుంచి నేర్చుకున్న విష‌యాలు నా కెప్టెన్సీకి చాలా ఉప‌యోగ‌ప‌డుతాయి. ఆర్‌సీబీ లాంటి పెద్ద ఫ్రాంచైజీలో ఆడ‌డం నా అదృష్టం. కెప్టెన్‌గా న‌న్ను ప్ర‌క‌టిస్తూ విరాట్ కోహ్లీ చేసిన పోస్ట్ ఎంతో స్పూర్తిదాయ‌కంగా అనిపించింది. అత‌డు గొప్ప సార‌థి. నాకు తోడు నీడ‌లా ఉంటాడు. విరాట్ స‌హ‌కారంతో జ‌ట్టును న‌డిపిస్తామ‌ని డుప్లెసిస్ చెప్పాడు.

Also Read :  వైసీపీ పాల‌న‌పై న‌మ్మ‌కం పోయిందంటున్న పురంధేశ్వ‌రి

Visitors Are Also Reading