Home » సీతారామం హిట్ తో రెమ్యునరేషన్ పెంచినా సీత..!

సీతారామం హిట్ తో రెమ్యునరేషన్ పెంచినా సీత..!

by Azhar
Ad
ఒక్క సినిమా హిట్ అయితే అందులో నటించే హీరో హీరోయిన్స్ తమ రెమ్యునరేషన్ అనేహి పెంచడం మాములు విషయమే. అందులోనూ ముఖ్యంగా హీరోయిన్స్ ఈ వరుసలో ముందు ఉంటారు. ఎందుకంటే హీరోలు అయితే ఎన్ని ఏళ్ళు అయిన సినిమాల్లో హీరోలుగా చేయ చేయవచ్చు. కానీ హీరోయిన్స్ కు ఆ అవకాశం ఉండదు. వారి కెరియర్ అనేది తక్కువ రోజులే ఉంటుంది. కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను వారు ఎక్కువగా ఫాలో అవుతారు
ఒక్క సినిమా హిట్ అయితే తప్పకుండా హీరోయిన్స్ కు పేరు, క్రేజ్ అనేది వస్తుంది. దాంతో వారు రెమ్యునరేషన్ పెంచేస్తారు. ఇప్పుడు సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్‌ ఠాకూర్‌ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతుంది. అయితే ఈ మధ్యే దుల్కర్ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్‌ జాటనగా నటించిన సీతారామం అనే సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాను నిర్మించిన వైజయంతి బ్యానర్ లోనే తన రెండవ సినిమా అనేది చేయడానికి మృణాల్‌ ఠాకూర్‌ సిద్ధం అయ్యింది. కానీ మొదటి సినిమా హిట్ తో తనకు వచ్చిన పేరు కారణంగా పారితోషకం అనేది భారీగా పెంచేసింది. ఎంతలా అంటే తన రెండవ సినిమాకే కోటి రూపాయల రెమ్యునరేషన్ కావాల్సిందిగా డిమాండ్ అనేది చేస్తుందట మృణాల్‌. అయితే సీతారామంలో తన నటనకు మంచి మార్కులు పడిన కారణంగానే మృణాల్‌ తన రేటు పెంచినట్లు అంచనా వేస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading