Home » మృణాల్ ఠాకూర్ ను ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా..?

మృణాల్ ఠాకూర్ ను ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా..?

by Azhar
Ad
తెలుగులో తాజాగా వచ్చిన సీతారామం అనే సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ జంటగా నటించారు. ఇక ఈ సినిమా మొదట కేవలం తెలుగులోనే హిట్ అయ్యింది. కానీ ఇక్కడ వచ్చిన టాక్ తో హిందీలో కూడా విడుదల చెయ్యాలి అనే డిమాండ్ రావడంతో అక్కడ కూడా విడుదహ్లా చేయగా.. హిందీలో కూడా హిట్ గానే నిలిచింది.
దాంతో ఇందులో హీరోయిన్ గా చ్చేసిన మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ కు ఫ్యాన్స్ అనేవారు పెరిగిపోయారు. ఈ సినిమాలో ఎంతో అందంగా… పద్ధతిగా కనిపించిన మృణాల్ ఠాకూర్.. సోషల్ మీడియాలో మాత్రమె గ్లామర్ షో చేస్తూ.. ఫోటోలు అనేవి షేర్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన మృణాల్ ఠాకూర్ తనకు ఫ్యాన్స్ నుండి ఎక్కువగా వస్తున్న ప్రశ్న ఏంటో చెప్పింది.
అయితే మొదట.. తాను ఇప్పటివరకు సీతారామం వంటి సినిమాను హిందీలో కూడా చేయలేదు అని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా తర్వాత తనకు అలాంటి అవకాశాలు వస్తున్నాయి అని చెప్పింది. ఇక ఫ్యాన్స్ తనను ఎక్కువగా.. తన వయస్సు గురించి ప్రశ్నిస్తున్నారు అని చెప్పిన మృణాల్ ఠాకూర్.. నా వయస్సు 30 అని సమాధానం ఇచ్చింది. అయితే మృణాల్ ఠాకూర్ కు హిందీలోనే కాకుండా.. ఇప్పుడు తెలుగులో కూడా ఆఫర్స్ అనేవి బాగానే వస్తున్నాయి.

Advertisement

Visitors Are Also Reading