టీం ఇండియా ప్లేయర్ రిషబ్ పంత్ కు సంబంధించి ఓ వార్త వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. ఓ కేటుగాడు రిషబ్ పంత్ ను 1.6 కోట్ల రూపాయలకు మోసం చేసాడు. ఇతను కూడా ఓ క్రికెటర్. ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఇతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఇతను ఎవరు? రిషబ్ పంత్ ని ఎలా మోసం చేసాడు? అనేది ఇప్పుడు చూద్దాం. ఇతని పేరు మృనాంక్ సింగ్. ఇతను గతంలో అండర్-19 క్రికెట్ లో హర్యానా తరపున ఆడాడు. ఈ క్రమంలోనే విలాసాలకు అలవాటు పడ్డాడు. డబ్బు కోసం పలువురు సెలెబ్రిటీలను, స్టార్ హోటల్స్ ను దగా చేసాడు.
Advertisement
ఇలా మోసపోయిన వారిలో రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. రిషబ్ పంత్ ని అయితే ఏకంగా రూ.1.6 కోట్ల రూపాయలకు మోసం చేసాడు. విలాసాలకు బాగా అలవాటు పడ్డ మృనాంక్ సింగ్ ఎక్కువ ఫైవ్ స్టార్ హోటల్స్ లోనే బస చేసేవాడు. అయితే.. బిల్ కట్టకుండా.. తనకి తానూ ఐపిఎల్ ప్లేయర్ ని అని.. 2014 నుంచి 2018 వరకు ముంబై ఇండియన్స్ కి ఆడానని చెప్పుకుంటూ వచ్చాడు. అలా చెప్పే.. అమ్మాయిలను కూడా వలలో వేసుకున్నాడు. మొదటిసారిగా 2022 లో ఇతను చేస్తున్న మోసాలు బయటకి వచ్చాయి.
Advertisement
ఓసారి ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో బస చేసిన మృనాంక్ బిల్ కట్టకుండా వెళ్ళిపోబోయాడు. అయితే.. హోటల్ వారు ఆపి బిల్ అడగగా ఆడిడాస్ వాళ్ళు బిల్ పే చేస్తారు అని బ్యాంకు డీటెయిల్స్ ని తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. ఆ తరువాత హోటల్ సిబ్బందికి రెండు లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ ఐడిని చూపించినా అది ఫెక్ అని తేలింది. హోటల్ వారు డబ్బు కోసం ప్రయత్నాలు చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకున్నాడు. పోలీసులకు కూడా దొరక్కుండా జాగ్రత్తపడి.. తానూ దుబాయ్ లో సెటిల్ అయినట్లు నమ్మించాడు. ఇటీవల డిసెంబర్ 25న హాంకాంగ్ వెళ్లడం కోసం మృనాంక్ ఎయిర్పోర్ట్ కు చేరుకోగా.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2020-21లో ఇతను రిషబ్ పంత్ ను మోసం చేసినట్లు గుర్తించారు. ఇతని జాబితాలో అమ్మాయిలు, క్యాబ్ డ్రైవర్లు, షాపుల వ్యక్తులు.. ఇలా చాలా మందే ఉన్నారు. ఇతను డ్రగ్స్ కూడా కొనుగోలు చేసాడని పోలిసుల విచారణలో తేలింది. ఇతని తల్లితండ్రులు కూడా ఇతన్ని పట్టించుకోవడం మానేశారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!