Home » హీరోయిన్ లేకుండానే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన హీరోలు…ఆ సినిమాలు ఎవంటే….?

హీరోయిన్ లేకుండానే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన హీరోలు…ఆ సినిమాలు ఎవంటే….?

by AJAY
Ad

దసరా కానుకగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదల అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నయనతార చిరంజీవికి సోదరి పాత్రలో నటించింది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత లూసిఫర్ మాదిరిగానే హీరోయిన్ లేకుండా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. అలా హీరోయిన్ లేనప్పటికీ ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Also Read:  మా తాత విగ్రహాన్ని లారీతో గుద్దిస్తారా అంటూ కొడాలి నాని పై సీరియస్ అయిన ఎన్టీఆర్..!!

Advertisement

Advertisement

ఇక గతంలోనూ కొన్ని సినిమాలు హీరోలకు హీరోయిన్ లేకపోయినప్పటికీ విజయం సాధించినాయి. ఆ సినిమాలు ఇప్పుడు చూద్దాం.


చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాను కూడా హీరోయిన్ లేకుండా తెరకెక్కించారు కానీ ఈ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.


నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకప్పుడే హీరోయిన్ లేకుండా నటించారు. నందమూరి బాలకృష్ణ వేములవాడ భీమకవి అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో బాలయ్య సింగిల్ గా నటించి హిట్ అందుకున్నారు.


మన్మధుడు నాగార్జున ఏకంగా నాలుగు సినిమాలలో హీరోయిన్ లేకుండా నటించారు. షిరిడి సాయి, గగనం, రాజు గారి గది, ఆఫీసర్ సినిమాల్లో హీరోయిన్ లేకుండా నటించి నాగ్ మెప్పించారు.


రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ సినిమా విక్రమ్ కూడా హీరోయిన్ లేకుండానే తెరకెక్కింది. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించారు. కానీ కమల్ హాసన్ కి జోడిగా హీరోయిన్ లేదు. అయినప్పటికీ ఈ సినిమా విజయం సాధించింది.


కార్తీ హీరోగా నటించిన ఖైదీ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో కూడా హీరోయిన్ లేకుండానే నటించాడు కార్తీ. అయినప్పటికీ ఈ సినిమా మంచి విజయం సాధించింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హీరోయిన్ లేకుండా నటించి మెప్పించారు. రజినీకాంత్ పెదరాయుడు సినిమాలో హీరోయిన్ లేకుండా నటించారు. అదేవిధంగా మరికొన్ని చిత్రాల్లో కూడా రజనీకాంత్ హీరోయిన్ లేకుండా నటించి హిట్ కొట్టారు.
Also Read: గాడ్‌ఫాద‌ర్ సినిమా గురించి చిరంజీవి ఏమ‌న్నారో తెలుసా..?

Visitors Are Also Reading