Home » దేశ వ్యాప్తంగా అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిన టాప్ 6 సినిమాలివే…!

దేశ వ్యాప్తంగా అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిన టాప్ 6 సినిమాలివే…!

by AJAY
Ad

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా మిగతా సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కడుతున్నారు. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప సినిమా హిందీలో 3.65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ మంచి వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో దేశ వ్యాప్తంగా విడుదలైన సినిమాల వసూళ్ళ పరంగా అల్లు అర్జున్ పుష్ప తో కొత్త రికార్డును సృష్టించాడు.

Pushpa

Advertisement

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా ఫస్ట్ డే దేశవ్యాప్తంగా 63.50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన వకీల్ సాబ్ సినిమా దేశవ్యాప్తంగా 52.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Advertisement

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన శివ దర్శకత్వంలో తెరకెక్కిన అన్నాత్తే సినిమాకు దేశవ్యాప్తంగా ఫస్ట్ డే రూ 50.85 కోట్ల వసూళ్లు వచ్చాయి.

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమాకు దేశవ్యాప్తంగా ఫస్ట్ డే 50.50 కోట్ల వసూళ్లు వచ్చాయి.

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దర్శకుడు రోహిత్ శెట్టి కాంబోలో వచ్చిన సూర్య వంశీ చిత్రం దేశ వ్యాప్తంగా రూ. 39.80 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రానికి దేశవ్యాప్తంగా ఫస్ట్ డే 29.80 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్ల పరంగా చూసినట్లైతే టాప్ 6 లో మూడు తెలుగు సినిమాలే ఉండటం చెప్పుకోదగ్గ విషయం

Visitors Are Also Reading