Telugu News » Blog » మార్చిలో విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న 5 తెలుగు సినిమాల లిస్ట్ ఇదే..!

మార్చిలో విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న 5 తెలుగు సినిమాల లిస్ట్ ఇదే..!

by AJAY
Ads

కరోనా కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన పలు చిత్రాలు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో. వాయిదా పడిన సినిమాలన్నీ విడుదలకు రెడీ అవుతున్నాయి. ఫిబ్రవరిలో లో పలు చిత్రాలు విడుదల కాగా మార్చిలో ఎక్కువ మొత్తంలో సినిమాలు విడుదల అవుతున్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం..

Ads

శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ఆడాళ్ళు మీకు జోహార్లు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మార్చి 4వ తేదీన విడుదల కానుంది.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన సినిమా సెబాస్టియన్ పీసీ 524. ఈ సినిమా కూడా మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం పోలీస్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Ads

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యా సాగర్ చింత ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జోడిగా రుక్సార్ దిలోన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా మార్చి 14న విడుదలకు సిద్ధంగా ఉంది.

Ad

ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలు నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కేసుల కార‌ణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం మార్చి 25న విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

radhe shyam

radhe shyam

ప్రభాస్ పూజ హెగ్డే హీరో హీరోయిన్ గా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 11న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.