Home » ఎన్టీఆర్ పుట్టిన రోజునే విడుద‌లైన సినిమాలు ఎన్నంటే.??

ఎన్టీఆర్ పుట్టిన రోజునే విడుద‌లైన సినిమాలు ఎన్నంటే.??

by Anji
Ad

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ భౌమ డాక్ట‌ర్ నంద‌మూరి తార‌క‌రామారావు సుదీర్ఘ‌మైన త‌న న‌ట‌న జీవితంలో దాదాపు 300 చిత్రాల‌కు పైగా న‌టించారు. మే 28 ఎన్టీఆర్ పుట్టిన రోజు. తెలుగు జాతి అంతా సంబ‌రాలు జ‌రుపుకునే రోజు. అభిమానులు ఆనందంతో కాల‌ర్ ఎగ‌రేసుకునే రోజు అనే చెప్పాలి. ఇలాంటి ప్ర‌త్యేక‌మైన రోజున ఎన్టీఆర్ న‌టించిన చిత్రాలు ఎన్ని విడుద‌ల‌య్యాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ పుట్టిన రోజున 7 సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇందులో రెండు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఓ పౌరాణిక చిత్రం, ఒక చారిత్ర‌క చిత్రం కూడా ఉన్నాయి. మిగిలిన‌వ‌న్ని సాంఘిక చిత్రాలే. ఆ చిత్రాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌లైన తొలి చిత్రం విచిత్ర కుటుంబం. 1969 మే 28న ఈ చిత్రం విడుద‌ల అయింది. ఎన్టీఆర్‌, కృష్ణ‌, హీరోలుగా న‌టించిన ఈ చిత్రంలో శోభ‌న్ బాబు గెస్ట్ రోల్ పోషించారు. వీరు ముగ్గురు క‌లిసి న‌టించిన ఏకైక చిత్రం విచిత్ర కుటుంబం అనే చెప్పాలి. మ‌హాన‌టి సావిత్రి, విజ‌య నిర్మ‌ల‌, శీల హీరోయిన్లుగా న‌టించారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రానికి కే.ఎస్. ప్ర‌కాశ్ రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణ అన్న‌ద‌మ్ములుగా న‌టించారు. విల‌న్‌గా నాగ‌భూష‌ణం, ఆయ‌న త‌మ్ముడిగా శోభ‌న్ బాబు న‌టించారు. విచిత్ర కుటుంబం బిగ్గెస్ట్ హిట్ కాకుండా మూడు కేంద్రాల్లో వంద రోజులు న‌డిచింది. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజున విడుద‌లైన రెండ‌వ చిత్రం సంసారం. 1975 లో ఈ చిత్రం విడుద‌ల అయింది. ఆ ఏడాది ఎన్టీఆర్ ఎనిమిది చిత్రాల్లో న‌టించాడు. వీటిలో 5క‌ల‌ర్ ఫిలింస్ ఉండ‌డం విశేషం.

 

Advertisement

ఆయ‌న ద్విపాత్రాభిన‌యం చేసిన కొండ వీటి సింహం చిత్రం ఇండ‌స్ట్రీ హిట్‌. మ‌రొక ద్విపాత్రాభిన‌యం చిత్రం గ‌జ‌దొంగ కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్‌. అలాగే త‌న సోద‌రుడు న‌ట సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు తో క‌లిసి న‌టించారు. ఆ సినిమా పేరు స‌త్యం, శివం. కె.రాఘ‌వేంద‌ర్‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఎన్టీఆర్‌, ఏఎన్నార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చివ‌రి సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. 1981 మే 28న భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన స‌త్యం శివం సుంద‌రం తొలివారం 51 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. క‌మ‌ర్షియ‌ల్‌గా ఓకే అనిపించుకుంది. ఇక ఎన్టీఆర్ పెద్ద అల్లుడు డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్‌రావు ఈ చిత్రానికి నిర్మాత‌.

1982లో ఎన్టీఆర్ 6 చిత్రాల్లో న‌టించాడు. అందులో బొబ్బులి పులి చిత్రం బిగ్గెస్ట్ హిట్‌. అదే ఏడాదిలో సెకండ్ బిగ్గేస్ట్ చిత్రం జ‌స్టీస్ చౌద‌రి. ఎన్టీఆర్ ద్విపాత్రాభియ చేసిన ఈ చిత్రంలో శార‌ద‌, శ్రీదేవి హీరోయిన్లు. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలు త్రివిక్ర‌మ్ రావు ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం చూపించిన ఈ చిత్రం 1982 మే 28న విడుద‌ల అయింది. 31 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. ఎన్టీఆర్ న‌టించిన చిత్రం చండ శాస‌నుడు ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినంయం చేశారు. ఆయ‌న సోద‌రిగా న‌టించిన శార‌ద న‌టించారు. అదేవిధంగా ఎన్టీఆర్‌-రాధా న‌టించిన ఏకైక చిత్రం చండ శాస‌నుడు. 1983లో భారీ ఓపెనింగ్స్‌తో విడుద‌ల అయింది. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత కూడా ఎన్టీఆర్ న‌టించిన చిత్రాల్లో బాల‌కృష్ణ న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. త‌నే అశోకుడు, చాణుక్యుడు వంటి పాత్ర‌లు పోషిస్తూ.. స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో సామ్రాట్ అశోక చిత్రంలో న‌టించాడు. భారీ అంచనాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం ఫ్లాప్ అయింది.

Also Read : 

సీఎంగా పెళ్లికి వెళ్లి పురోహితుడిగా మారి పెళ్లి జ‌రిపించిన ఎన్టీఆర్…ఆ పెళ్లి ఎవ‌రిదో తెలుసా..!

 

 

Visitors Are Also Reading