“నేనే నా కూతుర్ని గొలుసులతో బంధిస్తాను. ఆమె కాళ్లకు వేసిన ఆ గొలుసులు నా గుండెకు వేసుకున్న సంకెళ్లలా అనిపిస్తాయి. కానీ ఏం చేస్తాం? నా పరిస్థితి అలాంటిది.! ఎందుకంటే నా కూతురు మానసిక వికలాంగురాలు, పాప పుట్టిన కొన్ని రోజులకు నా భర్త చనిపోయాడు. అప్పటి నుండి రెండు మూడు ఇళ్లల్లో పాచి పని చేస్తూ నా కూతుర్ని పోషిస్తున్నాను. అలా వచ్చిన డబ్బును కూడబెట్టి పాపను ఎన్నో హాస్పిటల్స్ లో చూపించాను అయినా ప్రయోజనం లేకుండా పోయింది.
Advertisement
Advertisement
మొదట్లో నేను పనికి వెళ్లేటప్పుడు నా కూతుర్ని ఇంట్లోనే ఉంచి వెళ్లేదానికి, నా ఇళ్లు స్లమ్ ఏరియాలో ఉండడం చేత అక్కడ చాలా మంది పిల్లలు అవారాగా తిరుగుతూ ఉండేవారు. వారు అనేక చెడు వ్యసనాలకు భానిసలుగా ఉండేవారు. దీంతో వారు తాగిన మత్తులో నా ఇంట్లోకి వచ్చి నా కూతురితో తప్పుగా ప్రవర్తించేవారు.
ఎవరు తనని ఎన్ని విధాలుగా వేధించినా…. నేను రాగానే చప్పట్లు చరుస్తూ నవ్వుతుంది నా పిచ్చి తల్లి. నాకు నా కూతురి భవిష్యత్ ముఖ్యం, భద్రత కూడా ముఖ్యం. అందుకే నేను పనికి వెళ్లేటప్పుడు తనను ఇంట్లో ఉంచి గొలుసులతో కట్టేసి బయటి నుండి తాళం వేసుకొని వెళుతుంటాను. నిజం చెప్పాలంటే ఆ సంకెళ్లు ఆమె కాళ్లకు కావు నా గుండెకు!”