Home » వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గడియారం ఏదిక్కున ఉండాలో తెలుసా ?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గడియారం ఏదిక్కున ఉండాలో తెలుసా ?

by Anji
Ad

జీవితంలో స‌మాయం చాలా ముఖ్య‌మైన‌ది. స‌మ‌యంగా స‌రిగ్గా ఉంటే అన్ని బాగుంటాయి. లేదంటే అంతే సంగ‌తులు. మంచి, చెడు రెండు స‌మ‌యానికి సంబంధించిన‌వే. ముఖ్యంగా మీ జీవితంలో ఎలాంటి అవాంఛ‌నీయ స‌మ‌స్య‌లు లేదా అడ్డంకులు ఉండ‌కూడ‌దు అంటే ఇంట్లో వాస్తు ప్ర‌కారం.. గ‌డియారాన్ని ఉంచాలి. గ‌డియారం వాస్తు నియ‌మాల గురించి తెలుసుకుందాం. ఇంట్లో గ‌డియారం పెట్టేట‌ప్పుడు వాస్తు నియ‌మాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి. వాస్తు ప్ర‌కారం గ‌డియారాన్ని కొన్ని దిశ‌ల‌లో ఉంచ‌డం వ‌ల్ల జీవితంలో కొన్ని ర‌కాల క‌ష్టాలు ఎదురు అవుతాయి.

Buy JUJUDA Large Wall Clock for Living Room Decor Modern Silent Pendulum Wall Clock for Home House Kitchen Bedroom Decorative Big Wall Clock Non Ticking Battery Operated Quartz for Indoor Bathroom 17

Advertisement

ఉదాహ‌ర‌ణ‌కు ద‌క్షిణ‌గోడ‌పై లేదా టేబుల్‌పై గ‌డిచారం ఉండ‌టం వ‌ల్ల ఇంటి పెద్ద ఆరోగ్యం బాగుండ‌దు. గ‌డియారాన్ని త‌లుపై మాత్రం అస్స‌లు ఉంచ‌కూడ‌దు. ఇలా చేయ‌డం ద్వారా ఇంట్లో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య వాతావ‌ర‌ణం దెబ్బ‌తింటుంది. ఇంట్లో ఎప్పుడు కూడా చెడిపోయిన గ‌డియారం అస్స‌లు ఉంచ‌కూడ‌దు. స‌మ‌యాన్ని త‌ప్పు చూపే గ‌డియారం కూడా వాస్తు దోషాల‌కు కార‌ణ‌మ‌వుతుంది. ఈప‌రిస్థితిలో వాటిని ఇంట్లో నుంచి తీసివేయ‌డ‌మే మేలు. వాస్తు ప్ర‌కారం. న‌లుపు, నీలం రంగు గ‌డియాల‌ను ఇంట్లో పెట్ట‌కూడ‌దు. ఎందుకంటే అలాంటిరంగులు ప్ర‌తికూల శ‌క్తిని వ్యాపింప‌జేస్తాయి.

Advertisement

33 Wall clocks ideas | clock, diy clock, wall clock

వాస్తుప్ర‌కారం గ‌డియారాన్ని ఎల్ల‌ప్పుడు ఇంట్లో తూర్పు లేదా ఉత్త‌రం దిశ‌ల్లో ఉంచాలి. ఎందుకంటే సానుకూల శ‌క్తి తూర్పు, ఉత్త‌ర దిశ‌ల‌లో ప్ర‌వ‌హిస్తుంది. గ‌డియారాన్ని ఇంట్లో ఉంచేట‌ప్పుడు దాని ప‌రిమాణంపై కూడ శ్ర‌ద్ద వ‌హించాలి. వాస్తు ప్ర‌కారం.. ఇంటిగోడ‌పై ఉంచే గ‌డియారం ఆకారం ఎల్ల‌ప్పుడు గుండ్రంగా లేదా చ‌తుర‌స్రాకారంగా ఉండాలి. అదేవిధంగా లోల‌కం ఉన్న గ‌డియారం కూడా చాలా ప‌విత్ర‌మైంది. వాస్తు ప్ర‌కారం.. అలాంటి గ‌డియారంలో ఇంట్లో ప్రేమ‌, పురోగ‌తి, సామ‌ర‌స్యాన్ని పెంచుతుంది. వాస్తు ప్ర‌కారం అలాంటి గ‌డియారం ఇంట్లో ప్రేమ‌, పురోగ‌తి, సామ‌రస్యాన్ని పెంచుతున్న‌ది. కోణాల ఆకారంతో ఉన్న గ‌డియారాన్ని నిషేదించాలి. గ‌డియారం విష‌యంలో ఇలా చేయ‌క‌పోతే మాత్రం స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.

 

Visitors Are Also Reading