Home » ఐపీఎల్‌లో సూప‌ర్ ఓవ‌ర్‌లో విజ‌యం సాధించిన మ్యాచ్‌లు ఇవే..!

ఐపీఎల్‌లో సూప‌ర్ ఓవ‌ర్‌లో విజ‌యం సాధించిన మ్యాచ్‌లు ఇవే..!

by Anji
Ad

టీ-20 క్రికెట్ అంటేనే ర‌స‌వ‌త్త‌ర పోరాటాల‌కు చిరునామా అలాంటిది ఇక ఐపీఎల్‌లో ఆ మ‌జా ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌రం లేదు. చివ‌రి బంతి వ‌ర‌కు సాగే మ్యాచ్‌లు.. సూప‌ర్ ఓవ‌ర్‌లో తేలిని ఫ‌లితాలున్నాయి. ఇలా సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసి అభిమానుల‌కు అస‌లైన టీ-20 మ‌జాని అందించిన కొన్ని మ్యాచ్‌ల గురించి తెలుసుకుందాం.

Advertisement

2020 ఐపీఎల్ సీజ‌న్‌లో ముంబ‌యి, పంజాబ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన 36వ లీగ్ మ్యాచ్ ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యంత ఉత్కంఠ‌మైన మ్యాచ్‌గా నిలిచింది. ఎందుకు అంటే ఇందులో రెండు సార్లు సూప‌ర్ ఓవ‌ర్లు జ‌రిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబ‌యి 176/6 స్కోర్ చేసింది. ఓపెన‌ర్ డికాక్ (53) అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. ఛేద‌న‌లో పంజాబ్ కెప్టెన్ రాహుల్ (77) దంచికొట్టాడు. మిగ‌తా బ్యాట్స్‌మెన్‌లు సైతం త‌లా ఓ చేయి వేయ‌డంతో 20 ఓవ‌ర్ల‌కు అంతే స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్ కు దారి తీసింది. అక్క‌డ కూడా ఇరు జ‌ట్లూ 5 ప‌రుగుల చొప్పునే చేయ‌డం వ‌ల్ల ఉత్కంఠ మ‌రొక‌సారి తారాస్థాయికి చేరింది. మ‌ర‌ల మ‌రొక సూప‌ర్ ఓవ‌ర్ నిర్వ‌హించారు. ఈసారి ముంబ‌యి 11 ప‌రుగులు చేయ‌గా ఛేద‌న‌లో క్రిస్ గేల్‌, మ‌యాంక్ అగ‌ర్వాల్ బౌండ‌రీల‌తో విరుచుకుప‌డి పంజాబ్ ను గెలిపించారు.

2014 ఐపీఎల్ సీజ‌న్‌లో మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన సూప‌ర్ ఓవ‌ర్ జ‌రిగింది. అప్పుడు కోల్‌క‌తా రాజ‌స్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన 19వ లీగ్ మ్యాచ్‌లో కూడా సూప‌ర్ ఓవ‌ర్‌లో స్కోర్లు స‌మ‌యంగా మారాయి. అప్ప‌టికీ ఒక‌టి కంటే ఎక్కువ సూప‌ర్ ఓవ‌ర్లు నిర్వ‌హించే నియ‌మాలు లేక‌పోవ‌డం వ‌ల్ల బౌండ‌రీ కౌంట్ ఆధారంగా విజేతను ప్ర‌క‌టించారు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ 152/5 స్కోర్ చేసింది. ర‌హానె (72) ధాటిగా ఆడాడు. ఇక ఛేద‌న‌లో కోల్‌క‌తా 8 వికెట్లు కోల్పోయి అంతే స్కోర్ సాధించింది. దీంతో సూప‌ర్ ఓవ‌ర్ నిర్వ‌హించ‌గా కోల్‌క‌తా 11/2 స్కోర్ చేసింది. ఆపై ఛేద‌న‌లో స్మిత్‌, షేన్ వాట్స‌న్ ఐదు బంతుల్లో 9 ప‌రుగులు చేశారు. చివ‌రి బంతికి 3 ప‌రుగులు అవ‌స‌ర‌మైన స్థితిలో స్మిత్ బౌండ‌రీకి ప్ర‌య‌త్నించ‌కుండా రెండు ప‌రుగులే చేశాడు. మ్యాచ్ మ‌ళ్లీ టైగా మారినా ఆ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ ఎక్కువ బౌండ‌రీలు సాధించడంతో దానినే విజేత‌గా ఎంపిక చేసారు.

Advertisement

ఐపీఎల్‌లో మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన సూప‌ర్ ఓవ‌ర్‌లో ముంబ‌యి పాలు పంచుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే ఈసారి బుమ్రా మేటి బౌలింగ్‌తో ఆ జ‌ట్టు విజ‌యం సాధించింది. ఇది 2017లో గుజ‌రాత్ లయ‌న్స్‌తో జ‌రిగిన 35వ లీగ్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. అప్పుడు గుజ‌రాత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల న‌ష్టానికి 153 ప‌రుగులు చేయ‌గా.. ఛేద‌న‌లో పార్థివ్ ప‌టేల్ (70) మెరిసినా ఇత‌ర ముంబ‌యి బ్యాట్స్ మెన్ తేలిపోయారు. చివ‌రికి ఆ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌కు 153 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. మ్యాచ్ టైగా మారి సూప‌ర్ ఓవ‌ర్‌కు వెళ్ల‌గా ముంబ‌యి 11/2 స్కోర్ చేసింది. ఫించ్‌, బ్రెండ‌న్ మెక్‌క‌ల‌మ్ బ‌రిలోకి దిగ‌డంతో ఆ జ‌ట్టు విజ‌యం కేవ‌లం 6 ప‌రుగులే ఇచ్చాడు. దీంతో ముంబ‌యి ఓట‌మిపాల‌య్యే స్థితి నుంచి మ్యాచ్‌ను కైవ‌సం చేసుకుంది.


2013 ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య మ‌రొక ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌రిగింది. ఆ ఏడ‌వ లీగ్ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లూ త‌క్కువ స్కోర్లే న‌మోదు చేసినా సూప‌ర్ ఓవ‌ర్‌లో దంచికొట్టాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు 130/8 నామ‌మాత్రం స్కోర్ సాధించింది. విరాట్ కోహ్లీ (46) టాప్ స్కోర‌ర్‌. స‌న్‌రైజ‌ర్స్ హ‌నుమ విహారి (44) రాణించినా మిగ‌తా బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. దీంతో చివ‌రికి ఆ జ‌ట్టు కూడా 130/7 స్కోర్ చేసింది. మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్ వెళ్ల‌గా స‌న్‌రైజ‌ర్స్ బ్యాట్స్‌మెన్ కామ‌రూన్ వైట్ రెండు సిక్స‌ర్లు దంచి కొట్టాడు. దీంతో 20 ప‌రుగులు సాధించింది. అనంత‌రం బెంగ‌ళూరు జ‌ట్టులో కోహ్లీ ఒక ఫోర్, గేల్ ఒక సిక్స‌ర్ బాదినా ఆ జ‌ట్టు 15 ప‌రుగులే చేసి ఓట‌మి పాలైంది.

2010లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 16వ లీగ్ మ్యాచ్‌లో పోటీ ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 136/8 స్వ‌ల్ప స్కోరే సాధించింది. ఛేద‌న‌లో చెన్నై 12.3 ఓవ‌ర్ల‌కు 96 2 తో దెబ్బ‌కొట్టారు. దీంతో 97/3 నుంచి 20 ఓవ‌ర్ల‌కు 136/7 క‌ట్ట‌డి చేసి మ్యాచ్‌ను టైగా ముగించారు. త‌రువాత సూప‌ర్ ఓవ‌ర్‌లో బ్యాటింగ్ చేసిన చెన్నై 10 ప‌రుగులే చేసింది. త‌రువాత జ‌య‌వ‌ర్థ‌నే, యువ‌రాజ్ దంచి కొట్టి పంజాబ్‌ను గెలిపించారు.

Also Read :  2వ ప్ర‌పంచయుద్దంలో ఆలుగ‌డ్డ‌లు చేసిన ప‌ని!

Visitors Are Also Reading