ఓవైపు కరోనా వైరస్ తో ప్రజలు ఆందోళన చెందుతుంటే ఇప్పుడు మరో మహమ్మారి ఎంట్రీ ఇచ్చింది. కేరళ రాష్ట్రంలో ఈ ఏడాది మొదటి మంకీ ఫీవర్ కేసు నమోదు అయింది. తిరునెల్లే అనే గ్రామపంచాయతీకి చెందిన 24 ఏళ్ల యువకుడికి మంకీ ఫీవర్ వచ్చింది. ప్రస్తుతం ఆ వ్యక్తికి మనంతవాడి మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు.
Advertisement
ఇదిలా ఉంటే అసలు మంకీ ఫీవర్ అంటే ఏమిటి ….అది ఎలా సోకుతుంది అనే విషయం పై చాలా మందికి అవగాహన లేదు. మంకీ ఫీవర్ అంటే కోతుల నుండి మనుషులకు సంక్రమించిన వైరల్ ఫీవర్. ఈ జ్వరం ప్లావివిరిడే అనే వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మంకీ ఫీవర్ వచ్చినట్లయితే అధికంగా జ్వరం ఒళ్ళు నొప్పులు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
Advertisement
కొంతమందిలో మంకీ ఫీవర్ ద్వారా డెంగ్యూ జ్వరానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఫీవర్ కోతులను తాకడం ద్వారా సోకే అవకాశం ఉంది. ఈ ఫీవర్ వచ్చినట్లయితే 5 నుండి 10 శాతం మరణించే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా మంకీ ఫీవర్ వచ్చిన వారికి వికారంగా ఉండటం.. వాంతులు అవ్వడం, కంటి దృష్టి తగ్గిపోవడం, విపరీతమైన తలనొప్పి, ప్రతిస్పందనలు తగ్గిపోవడం, కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఈ మహమ్మారికి కూడా కరోనా మాదిరిగానే సరైన చికిత్స అంటూ లేదు. ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు.