డబ్బు అంటే ఎవరికీ చేదు? రూపాయి అయినా సరే జాగ్రత్త చేసుకోవాలి అని అనుకుంటాం. సంపాదించుకోవడంతో పాటు ఎప్పుడైనా ఎక్కడైనా డబ్బులు దొరికినా, వాటిని అపురూపంగా దాచుకుంటాం. తక్కువ మొత్తంలో డబ్బులైతే పర్లేదు. కానీ, ఒక్కోసారి పెద్ద నోట్లు కూడా కనిపిస్తే.. మనం వాటిని తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాం. ఎవరైనా ఆ డబ్బుని పారేసుకున్నారేమో అని ఆలోచిస్తాం. అయితే.. ఇలా రోడ్డుపై ఎక్కువ మొత్తంలో డబ్బు దొరకడం దేనికి సంకేతం? ఇది మంచిదా? చెడా? అన్న సంగతి ఇప్పుడు చూద్దాం.
Advertisement
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎక్కువ మొత్తంలో డబ్బు దొరికితే అది శుభప్రదంగా భావించబడుతుంది. మీరు పడిపోయిన నాణేలను చూస్తే, మీరు మీ పూర్వీకుల ఆశీర్వాదం పొందినట్లు భావించాలి. ఈ విశ్వాసాల ప్రకారంగా చూస్తే..మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ చిల్లరను మీరు తీసుకోవడం ద్వారా మీరు ఏ పనిని చేపట్టినా విజయం సాధిస్తారు. అలాగే.. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు పనికి బయలుదేరినప్పుడు నోటు కనిపిస్తే.. మీకు ఆ పని విజయవంతంగా పూర్తవుతుందని అర్ధం.
Advertisement
అయితే.. ఈ డబ్బుని ఖర్చు చేయవద్దు. దాని వలన మీ ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది. ఆ డబ్బుని మీరు తీసుకోవడం వలన పోగొట్టుకున్న వారి ఆవేదన, కన్నీళ్లు మీకు తగులుతాయి. అందుకే, ఆ డబ్బుని ఏదైనా మంచి పనికి వినియోగించండి. దేవుడి హుండీలో వేయడం లేదా ఏదైనా ఆలయానికి విరాళము ఇవ్వడమో చేయండి. ఆ డబ్బు పోగొట్టుకున్న వారికి మంచి జరగాలని కోరుకోండి. రోడ్డుపై చిల్లర నాణాలు దొరకడం అనేది మీ జీవితంలో మీకు మంచి జరగాలని కోరుకోండి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు
హీరోయిన్ శ్రీలీల సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..? అందుకోసమేనా ?
ఆ స్టార్ హీరోతో నిత్యామీనన్ డేటింగ్…రహస్యంగా ఇక ఆ పని కూడా…?