Home » మోక్షాజ్ఞ సినిమాకు టైటిల్ ఫిక్స్….బాల‌య్య న‌టించిన ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా సీక్సెల్ తో లాంచ్..!

మోక్షాజ్ఞ సినిమాకు టైటిల్ ఫిక్స్….బాల‌య్య న‌టించిన ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా సీక్సెల్ తో లాంచ్..!

by AJAY
Ad

న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్ న‌ట‌వార‌సుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాల‌య్య స్టార్ హీరోగా ఎదిగారు. తండ్రి న‌ట వార‌స‌త్వాన్ని బాల‌య్య కొన‌సాగిస్తున్నాడు. కేవ‌లం ఒకేర‌క‌మైన పాత్ర‌ల‌కు ఫిక్స్ అవ్వ‌కుండా అన్ని ర‌క‌మైన పాత్ర‌ల‌తో అద‌ర‌గొడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య ఆదిత్య 369 అనే సినిమాలో న‌టించారు.

Advertisement

ఈ సినిమా టైం ట్రావెల్ క‌థాంశంతో తెర‌కెక్కింది. అప్ప‌ట్లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్ప‌టికి ఈ సినిమాకు అభిమానులు ఉన్నారు. రెండు కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌గా ఈ సినిమా తొమ్మిది కోట్లు క‌లెక్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా సీక్వెల్ తో ఇప్పుడు బాల‌య్య త‌న‌యుడు మోక్షాజ్ఞ ఎంట్రీ ఉండ‌బోతుంది అంటూ టాలీవుడ్ లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement

ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే డైరెక్ట‌ర్ చాలా సార్లు ఈ సినిమాకు సీక్వెల్ ఉండ‌బోతుంద‌ని చెప్పారు. అంతే కాకుండా సినిమా క‌థ కూడా సిద్దంగా ఉంద‌ని అన్నారు. అయితే ఈ సీక్వెల్ లో హీరోతో పాటూ డైరెక్ట‌ర్ కూడా మారిపోతున్నారు. అంతే కాకుండా ఆదిత్య‌369 సినిమా డైరెక్ట‌ర్ బాల‌య్య త‌న కొడుకు మోక్ష‌జ్ఞ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు.

mokshagna

mokshagna

ఇక సీక్వెల్ కు ఆదిత్య 999 అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కూడా సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు టాక్. ఇక ఈ సినిమా పై ప్ర‌క‌ట‌న కూడా త్వ‌ర‌లోనే రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌క‌ట‌న విడుద‌ల‌వుతే సినిమా గురించి అన్ని డీటెయిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Visitors Are Also Reading