టాలీవుడ్ లో స్టార్స్ గా ఎదిగిన హీరోలలో మోహన్ బాబు ఒకరు. సొంత టాలెంట్ తో మోహన్ బాబు స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. అప్పట్లో అగ్రదర్శకులతో సినిమాలు చేశారు. మోహన్ బాబు సినిమాలు రెండు వందల రోజు ఆడిన సంధర్భాలు కూడా ఉన్నాయి. మోహన్ బాబు కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా పెదరాయుడు….1995లో విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా తరవాత మోహన్ బాబు స్వీయ నిర్మాణంలోనూ సినిమాలు చేశారు.
Advertisement
ALSO READ : వామ్మో అనసూయకు అంత ఏజ్ ఉంటుందా..? షాక్ లో ఫ్యాన్స్..!
నిర్మాతగా కూడా మంచి విజయాలను అందుకున్నారు. ఇక మోహన్ బాబు దాసరినారాయణ రావు తన గురువు అని ఆయనే తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేసుకోని సంధర్బం ఉండదు. దానికి కారణం వారిద్దరి మధ్య ఎంతో మంచి రిలేషన్ ఉండేది. ఇక మోహన్ బాబు ఎన్టీరామారావును కూడా అభిమానించేవారు. ఇదిలా ఉండగా మోహన్ బాబు ఎన్టీఆర్ హీరో 1950లో వచ్చిన అప్పు చేసి పప్పుకూడు అనే సినిమా ఆధారంగా తప్పు చేసి పప్పు కూడు అనే వినోద భరితమైన సినిమాను తన సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పై నిర్మించారు.
Advertisement
ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. అంతకముందు వరుస ఫ్లాప్ లు పడటంతో మోహన్ బాబు ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటూ శ్రీకాంత్ కూడా హీరోగా నటించారు. అయితే ఈ సినిమా కోసం మొదటగా మోహన్ బాబు ఆర్తి అగర్వాల్ ను హీరోయిన్ గా అనుకున్నారు. ఆ సమయంలో స్టార్ హీరోయిన్ ఆర్తి పలు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
కానీ మోహన్ బాబు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే షూటింగ్ ప్రారంభం అయ్యే సరికి ఆర్తి అగర్వాల్ తనకు ఏవో పరీక్షలు ఉన్నాయని చెప్పి తప్పించుకుంది. అంతే కాకుండా అదే టైమ్ లో వేరే సినిమాలో నటించింది. ఈ విషయం మోహన్ బాబుకు తెలియడంతో ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో ఆర్తి అగర్వాల్ పదిలక్షల రూపాయల ఫైన్ కట్టాల్సివచ్చింది. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా నిలిచింది.