Home » మోహన్ బాబుతో పోటీకి వచ్చిన చిరంజీవికి ఎందుకు ఘోరమైన ఫ్లాప్ అయ్యిందంటే ..?

మోహన్ బాబుతో పోటీకి వచ్చిన చిరంజీవికి ఎందుకు ఘోరమైన ఫ్లాప్ అయ్యిందంటే ..?

Ad

1994 లో తమిళ్ లో నాట్ మై అనే సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి వెంటనే ఆకర్షితులైన సూపర్ స్టార్ రజినీకాంత్ తన స్నేహితుడైన మోహన్ బాబుని ఆ సినిమా హక్కులు కొనుక్కునేలా చేశారు. అంతే కాకుండా చిన్న పాత్ర అయినా సరే సెకండాఫ్ లో వచ్చే రాయుడు పాత్రని నేనే వేస్తాను అని హామీ ఇచ్చారట. అప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మోహన్ బాబు రవిరాజా పినిశెట్టిని దర్శకుడుగా ఎంచుకున్నారు. తన సొంత బ్యానర్ మీదే ఆ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. అదే పెదరాయుడు సినిమా. ఈ సినిమాలో పాపారాయుడు పాత్రలో రజినీకాంత్ నటించారు.పెదరాయుడు సినిమా వచ్చి పాతిక సంవత్సరాలు అయినప్పటికీ ఆ పాత్రలో ఇంకొకరిని ఉహించుకోవడం కష్టం అనేంతగా ఆ పాత్రకి జీవం పోసారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. జూన్ 15,1995 సంవత్సరం పెదరాయుడు విడుదలైంది. అదే రోజు మెగాస్టార్ బిగ్ బాస్ సినిమా విడుదలైంది. దాని దెబ్బకు పెదరాయుడు సినిమా నిలబడుతుందా లేదా అని అందరూ అనుకున్నారు. కానీ మొదటివారంలోనే సీన్ రివర్స్ అయ్యింది. అన్ని చోట్ల పెదరాయుడు కి సూపర్ హిట్ టాక్ వచ్చింది. క్రమ క్రమంగా సినిమా హాల్ కిటకిటలాడి పోయింది. వస్తున్న వసూళ్లను చూసి డిస్ట్రిబ్యూటర్లకు గుండె ఆగినంత పని అయింది. ఈ దాటికి తట్టుకోలేక పోవడం వల్ల, సినిమాలో పెద్దగా స్టోరీ లేకపోవడం వల్ల బిగ్ బాస్ సినిమా ప్లాప్ అయింది. అప్పటిదాకా ఘరానా మొగుడు సినిమా రాసుకున్న 10 కోట్ల రికార్డులను రెండు కోట్ల మార్జిన్ తో పెద్ద రాయుడు కొట్టేశాడు.25 సంవత్సరాలు పూర్తయిన కూడా పెదరాయుడు సినిమా ఆల్ టైం క్లాసిక్ గా నిలిచింది.

Advertisement

ALSO READ :

Advertisement

స‌ర్కారు వారి పాట స్టోరీ లీక్‌.. మ‌నీ విష‌యంలో మ‌హేష్ అందుకే అలా చేశాడా..?

గంట‌ల వ్య‌వ‌ధిలోనే స‌మంత ఫోటోకు ల‌క్ష‌ల్లో కామెంట్స్‌, లైక్స్‌..!

 

 

Visitors Are Also Reading