Home » చిరు నా ఫేవరెట్ హీరో అన్నందుకు ఉయ్యాల పై నుంచి మోహన్ బాబు నేలకేసి కొట్టారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..!!

చిరు నా ఫేవరెట్ హీరో అన్నందుకు ఉయ్యాల పై నుంచి మోహన్ బాబు నేలకేసి కొట్టారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..!!

by Sravanthi Pandrala Pandrala

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రేష్ట. అలాంటి ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రేష్ట మంచి రోల్స్ వస్తే సినిమాల్లోకి మళ్లీ రీయంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసింది. తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా ముఖ్యమైన పాత్రలు చేశానని,ప్రాధాన్యత కలిగిన పాత్రలు వస్తే మళ్లీ నటించాలని భావిస్తున్నానని అన్నారు. నేను ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అనుకుంటే చాలని తెలియజేశారు.

ALSO READ:నటనకు బ్రాండ్ అంబాసిడర్.. గుర్తు పట్టలేని అవతారం !

బయోటెక్ ఫార్మ్ పెట్టడమే నా జీవిత ఆశయమని కానీ అది పెట్టడం అంత సులువైన పని కాదంటూ కామెంట్స్ చేశారు. నేను మాస్టర్ బయోటెక్నాలజీ పూర్తి చేసానని అన్నారు. నాకు ఇన్స్పిరేషన్ ఎవరనే ప్రశ్న ఎదురైతే ఎప్పటికీ చిరంజీవి అని చెబుతానని సమాధానం ఇచ్చారు. చిరంజీవి గారు చారిటీ లు చాలా చేస్తారని, గర్లుగా నేను ఛాలెంజర్స్ ఫేస్ చేశానని శ్రేష్ట పేర్కొన్నారు.

ALSO READ:అవినాష్ రెడ్డి, సిఎం జగన్ తో నాకు ప్రాణహాని ఉంది – దస్తగిరి సంచలనం

అయితే నేను మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో జర్నలిస్టు ప్రభు నా ఇంటర్వ్యూ తీసుకొని చిరంజీవి నా ఫేవరెట్ హీరో అని హెడ్డింగ్ పెట్టారని తెలియజేశారు. ఆ మరునాడు అదే హెడ్డింగ్ తో వచ్చిన పేపర్ ను చూసిన మోహన్ బాబు నా సినిమాల్లో చేస్తూ చిరంజీవి నా ఫేవరెట్ హీరో అని చెబుతావా అంటూ ఆ పేపర్ ను నేలకేసి కొట్టారని తెలిపింది. ఆ తర్వాత కాసేపటికి నవ్వుకుంటూ నా దగ్గరికి వచ్చారని అన్నది. ఇప్పటికీ చిరంజీవి నా ఫేవరెట్ హీరో అని తెలియజేసింది.

ALSO READ:పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న సుధీర్…వ‌ధువు ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Visitors Are Also Reading