మాస్ క్లాస్, హిప్ పాప్ ఎన్ని రకాల పాటలు వచ్చినా జానపదానికి మాత్రం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. జానపదానికి క్రేజ్ ఎప్పుడూ తగ్గలేదు…తగ్గేది లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. ప్రతిరోజూ యూట్యూబ్ లో వందల సంఖ్యలో జానపదాలు విడుదల అవుతుంటాయి. అందులో కొన్ని పాటలకు సినిమా పాటలకు మించిన గుర్తింపు వచ్చింది. అలాంటి గుర్తింపే రీసెంట్ గా విడుదలైన బుల్లెట్ బండి పాటకు వచ్చింది. ఈ పాట విడుదలై కొంత కాలం గడిచిన తరవాత ఓ పెళ్లి కూతురు ఈ పాటకు డ్యాన్స్ చేయగా పాటకు మరింత గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా పెళ్లి అంటే అక్కడ బుల్లెట్ బండి పాట ఉండాల్సిందేనా అన్నట్టుగా మారింపోయింది.
Also Read: కోట్ల రూపాయలు భరణంగా తీసుకుని విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు వీరే..?
Advertisement
ప్రతి పెళ్లికూతురు పెళ్లికి ముందు కచ్చితంగా బుల్లెట్ బండి పాట నేర్చుకోవాలి భరాత్ లో పెళ్లి కొడుకుతో కలిసి స్టెప్పులు వేయాలి లేదంటే ఏదో లోటు ఉన్నట్టే అన్నంతలా బుల్లెట్ బండి పాట ప్రభావం చూపించింది. ఇక ఇప్పటికే బుల్లెట్ బండికి మూడు కోట్లకు పైగా వ్యూవ్స్ రాగా లక్షల్లో లైకులు వేలల్లో కామెంట్లు కూడా వచ్చాయి. ఇక ఇంతలా పాపులర్ ఇయ్యిన బుల్లెట్ బండి పాటను ఎవరు పాడారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం….రచయిత లక్ష్మణ్ ఈ పాటకు లిరిక్స్ అందించగా ఎస్ కే బాజీ సంగీతం అందించారు. ప్రముఖ గాయని మోహన బోగరాజు గొంతునుండి ఈ జానపదం జాలు వారింది. మోహన బోగరాజు ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ సింగర్ గా రాణిస్తున్నారు. మూడేళ్ల వయసులోనే మోహన బోగరాజు స్వరాలు నేర్చుకుంది.
Advertisement
సంగీతం నేర్చుకుంటున్న సమయంలోనే మోహన గొంతు విని సంగీత దర్వకుడు బాలాజీ జై శ్రీరాం సినిమాలో మోహనతో ఓ పాటను పాడించారు. ఆ తరవాత మోహనకు అనేక సినిమాల్లో పాడేందుకు అవకాశాలు వచ్చాయి.
ఇక రీసెంట్ గా విడుదలైన నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాలో తన గొంతుతో మోహన బోగరాజు అలరించింది. అంతేకాకుండా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఫోన్ చేసి బాహుబలి సినిమాలో మనోహరి పాటను పాడాలాని ఆఫర్ ఇచ్చారట. ఇక సినిమాల్లోనే కాకుండా ప్రైవేటు ఆల్బమ్ లు పాడుతూ అదరగొడుతున్న మోహన ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: కన్నడ నీరాజనం.. పునీత్‌రాజ్‌కు కర్నాటక రత్న అవార్డు