మెగాస్టార్ చిరంజీవి ఆదివారం సినీ కార్మికులకు హెల్త్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా తను సినిమా ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా వ్యవహరించాలనుకోవడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే మెగాస్టార్ కామెంట్లు చేసిన తర్వాత మోహన్ బాబు రాసిన బహిరంగ లేఖ సంచలనం రేపుతోంది. లేఖలో… మనకెందుకు మనకెందుకు అని మౌనంగా ఉండాలా..
నా మౌనం చేతకానితనం కాదంటూ మోహన్ బాబు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం నలుగురు హీరోలు నలుగురు ప్రొడ్యూసర్లు నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదని కొన్ని వేల ఆశలు కొన్ని వేల కుటుంబాలు కొన్ని జీవితాలు అని అన్నారు.
Advertisement
Advertisement
సినిమా ఇండస్ట్రీ సమస్యలను గురించి ముఖ్యమంత్రికి వివరించాలి అంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమై సమస్య ఏంటి..? పరిష్కారాలు ఏంటి.? ఏది చేస్తే ఇండస్ట్రీకి మనుగడ ఉంటుంది అని చర్చించుకోవాలి అన్నారు. ఆ తర్వాతనే సినిమాటోగ్రఫీ మంత్రులను, ముఖ్యమంత్రి ను కలవాలని పేర్కొన్నారు. అలాకాకుండా నలుగురినే రమ్మన్నారు అని నలుగురు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుండి ముగ్గురు, హీరోల నుండి ఇద్దరు ఏంటిది అంటూ మోహన్ బాబు ప్రశ్నించారు. పరిశ్రమలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అని మోహన్ బాబు అన్నారు. అందరూ సమానమే అని ఎవరి గుత్తాధిపత్యం కాదని చెప్పారు. చిన్న నిర్మాతలను కూడా కలుపుకుని ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్ళి సమస్యలను పరిష్కరిస్తే ఈ రోజు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని అన్నారు.
Also read : పెళ్లైన 8నెలలకే భర్తకు విడాకులిచ్చిన హీరోయిన్..కారణం ఏంటో తెలుసా..?
సినిమా పరిశ్రమలో ఒక పార్టీ వాళ్లు ఉండవచ్చని లేదా వేర్వేరు పార్టీల వారు కూడా ఉండవచ్చు అది వారి ఇష్టం అని అన్నారు. కానీ ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రులను ముందుగా కలవాలని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. రూ. 300, రూ. 350 టికెట్ల రేట్లతో చిన్న సినిమాలకు కష్టం అని అన్నారు. రూ. 50, రూ.30 టిక్కెట్లతో పెద్ద సినిమాలు నిలబడటం కష్టం అన్నారు. పెద్ద సినిమాలకు చిన్న సినిమాలకు నష్టం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని మోహన్ బాబు పేర్కొన్నారు. సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ అని ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సి ఉందని అందరూ ఒక్కటిగా ఉంటేనే సినిమా పరిశ్రమ బతుకుతుంది అని మోహన్ బాబు పేర్కొన్నారు.