Home » Buzzigadu:’బుజ్జిగాడు’లో మోహన్ బాబు శివన్న పాత్ర మిస్ చేసుకున్న నటుడు ఎవరంటే..?

Buzzigadu:’బుజ్జిగాడు’లో మోహన్ బాబు శివన్న పాత్ర మిస్ చేసుకున్న నటుడు ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆయన ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సినిమాల ద్వారా ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన కెరియర్ లో వచ్చిన బెస్ట్ మూవీ లో ఒకటి బుజ్జిగాడు. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎక్కువ రాబట్ట లేకపోయినా కానీ యాక్టింగ్ పరంగా అదరగొట్టేశారు.

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ లో ప్రభాస్ హీరోగా త్రిష హీరోయిన్ గా మోహన్ బాబు, సునీల్ , సంజన గల్రాని కీలక పాత్రల్లో నటించారు. ఇందులో త్రిష అన్నయ్యగా మోహన్ బాబు పాత్ర చిత్రానికి హైలైట్ గా చెప్పవచ్చు. శివన్నగా మోహన్ బాబు తన మార్కు నటనతో ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మోహన్ బాబు చేసిన పాత్రకి ముందుగా అనుకున్నది ఆయన కాదట.

శ్రీహరిని ఈ పాత్రకు తీసుకుందామని అనుకున్నారట డైరెక్టర్. కానీ శ్రీహరి వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల నో చెప్పారట. అప్పటికే శ్రీహరి నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమాలో త్రిష కు అన్నయ్యగా నటించారు. మళ్లీ బుజ్జిగాడు లో కూడా నటిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని కూడా భావించారట. దీంతో శివన్న పాత్రకు మోహన్ బాబుని ఫైనల్ చేసారట.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading