టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మోహన్ బాబు రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం సినిమాలు యూనివర్సిటీ పనుల్లో బిజీగా ఉన్నానని మోహన్ బాబు తెలిపారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఎప్పటినుంచో మంత్రి పేర్ని నాని తన స్నేహితుడని…. ఇంటికి వస్తే తప్పేంటని మోహన్ బాబు ప్రశ్నించారు.
Advertisement
Advertisement
ముఖ్యమంత్రి జగన్ తో ఇండస్ట్రీ వాళ్ళు చర్చించిన విషయాలేవీ తాము చర్చించలేదని మోహన్ బాబు తెలిపారు. ఇదిలా ఉండగా 2019 ఎన్నికల ముందు మోహన్ బాబు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మోహన్ బాబుకు రాజ్యసభ టికెట్ ఇస్తారని కూడా అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. కానీ తాజాగా మోహన్ బాబు రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే మంచు విష్ణు పేర్ని నాని సమావేశం అనంతరం ఇండస్ట్రీ గురించి చర్చించామని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ పేర్ని నాని మాత్రం తనను కాఫీ కి పిలిచినందుకే వెళ్ళా అని చెప్పారు. ఎవరో ఏదో ట్వీట్ చేస్తే అడుగుతారా అంటూ మండి పడ్డారు. ఈ మ్యాటర్ వల్లే మోహన్ బాబు హర్ట్ అయ్యి ఉంటారని అందుకే రాజకీయాలకు గుడ్ బై చెబుతూ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.