Home » అల్లు అర్జున్ ర‌ష్మిక సీన్ పై మోహ‌న్ బాబు సెటైర్లు…?

అల్లు అర్జున్ ర‌ష్మిక సీన్ పై మోహ‌న్ బాబు సెటైర్లు…?

by AJAY
Ad

చాలా కాలం గ్యాప్ త‌ర‌వాత మోహ‌న్ బాబు హీరోగా న‌టించిన సినిమా స‌న్ ఆఫ్ ఇండియా. ఈ సినిమాకు మంచు విష్ణు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 18 థియేట‌ర్ల‌లో విడుదలైంది. ఈ సినిమాను ఓటీటీ కోసం తెర‌కెక్కించారు. కానీ గిట్టుబాటు ధ‌ర రాక‌పోవ‌డంతో థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశార‌నే టాక్ ఉంది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌లో భాగంగా మోహ‌న్ బాబు ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో బిజీగా ఉన్నారు.

Advertisement

అయితే రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో మెహన్ బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ మ‌ధ్య ప్రేక్ష‌కుల టేస్ట్ గ‌మ్మ‌త్తుగా ఉంటుంద‌ని అన్నారు. అలా అని బ్లేమ్ చేయ‌ట్లేద‌ని…అక్క‌డ చేయి వేసాను తీయాలా….కాలు వేశాను తీయాలా లాంటి స‌న్నివేశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని అన్నారు. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప సినిమాలో కూడా అలాంటి ఓ స‌న్నివేశం ఉంది.

Advertisement

pushpa

pushpa

ర‌ష్మిక మంద‌న అల్లు అర్జున్ మ‌ధ్య సాగే ఆ స‌న్నివేశాన్ని మొదటిరోజు త‌ర‌వాత థియేట‌ర్ల నుండి తొల‌గించారు. అయితే ఇప్పుడు ఇదే స‌న్నివేశంపై మోహ‌న్ బాబు సినిమా పేరు బ‌య‌ట‌పెట్ట‌కుండా కామెంట్లు చేశారంటూ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతే కాకుండా మోహ‌న్ బాబు మంచు విష్ణు పై వ‌స్తున్న ట్రోల్స్ పై కూడా స్పందించారు.

మంచు విష్ణు ఏం చేసినా కాంట్ర‌వ‌ర్సీ చేస్తున్నార‌ని కొంద‌రు దుర్మార్గులే ఇలా చేస్తున్నార‌ని అన్నారు. విష్ణు వెళ్లి జ‌గ‌న్ ను క‌లిశారు..వాళ్లిద్ద‌రూ లంచ్ మీటింగ్ లో చాలా మంచి విష‌యాల‌ను మాట్లాడుకున్నారు ఇలాంటి విష‌యాలు ఎందుకు మాట్లాడ‌రని అన్నారు. ఇక స‌న్ ఆఫ్ ఇండియాలోనూ ముద్దు సీన్ లు ఉన్నాయ‌ని క‌థ డిమాండ్ చేయ‌డంతో త‌ప్ప‌లేద‌ని అన్నారు.

Visitors Are Also Reading