Telugu News » Blog » ఒకే ఫ్రేమ్ లో మోడీ, సోనియా గాంధీ….ఫోటో వైరల్…!

ఒకే ఫ్రేమ్ లో మోడీ, సోనియా గాంధీ….ఫోటో వైరల్…!

by AJAY
Published: Last Updated on
Ads

ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ రాజకీయంగా బద్రశత్రువులు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికలు వచ్చాయంటే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ప్రభుత్వం చేసే పనుల్లో తప్పులు కనిపించిన ప్రతిసారీ విమర్శలు కురిపిస్తునే ఉంటారు. కానీ తాజాగా సోనియా గాంధీ ప్రధాని మోడీ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. గురువారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆయా పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Advertisement

Advertisement

అప్పటికే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి కూర్చున్నారు. అయితే అదే సమయంలో సోనియా గాంధీ కూడా సమావేశం మందిరంలోకి అడుగుపెట్టారు. దాంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ రాజ్ నాథ్ సింగ్ కూడా లేచి నిలబడ్డారు. ఆ ముగ్గురు నేతలకు సోనియాగాంధీ నమస్కారం పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోను లోక్ సభ స్పీకర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

You may also like