Home » బుల్లి తెర‌పై కొత్త ల‌వ్ స్టోరీ…యూట్యూబ్ స్టార్ కు మెహ‌బూబ్ ల‌వ్ ప్ర‌పోజ్..!

బుల్లి తెర‌పై కొత్త ల‌వ్ స్టోరీ…యూట్యూబ్ స్టార్ కు మెహ‌బూబ్ ల‌వ్ ప్ర‌పోజ్..!

by AJAY
Ad

సోష‌ల్ మీడియా ద్వారా చాలా మందికి సెల‌బ్రెటీ స్టేటస్ వ‌చ్చింది. ముఖ్యంగా దేశంలో టిక్ టాక్, ఇన్స్టా గ్రామ్ ద్వారా ఎక్కువ మంది సెల‌బ్రెటీలుగా మారారు. అలా టిక్ టాక్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో గుంటూరు కుర్రాడు మెహ‌బూబ్ దిల్ సే కూడా ఒక‌రు. టిక్ టాక్ లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న మెహ‌బూబ్ ఆ త‌ర‌వాత ఏకంగా బిగ్ బాస్ సీజ‌న్ 4 లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా బిగ్ బాస్ లో త‌న కండ‌బ‌లం చూపిస్తూ టాస్కులు ఆడి, సోహెల్ తో స్నేహంతో ఫైన‌ల్ వ‌ర‌కూ కొన‌సాగాడు.

mehaboob proposed swetha naidu

mehaboob proposed swetha naidu

ఇక మెహ‌బూబ్ టిక్ టామ్ మరియు ఇన్స్టా గ్రామ్ ల‌లో శ్వేత నాయుడు అనే అమ్మాయితో ఎక్కువ‌గా వీడియోలు చేశాడు. అంతే కాకుండా వీరిద్దరూ క‌లిసి చేసిన క‌వ‌ర్ సాంగ్ ల‌కు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలా శ్వేత నాయుడు కూడా యూట్యూబ్ స్టార్ గా మారిపోయింది. మ‌రో వైపు శ్వేత నాయుడు అచ్చం స‌మంత మాట్లాడుతూ మ‌రి కొంద‌రు న‌టీమ‌ణుల‌ను అనుక‌రిస్తూ ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే వీరిద్ద‌రూ క‌లిసి ఇప్పుడు అభిమానుల‌కు షాక్ ఇచ్చారు. మెహబూబ్ త‌న ఇన్స్టాగ్రామ్ లో శ్వేత నాయుడుకు ప్ర‌పోజ్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు.

Advertisement

Advertisement

ఈ వీడియోలో మెహబూన్ శ్వేత నాయుడుకు ఓ గులాభి పువ్వును ఇచ్చి ఎప్ప‌టి నుండో నీకు ఒక‌టి చెబుతాన‌ని అనుకుంటున్నా…ఎప్పుడు అయ్యిందో ఎలా అయ్యిందో తెలియదు కానీ నువ్వంటే నాకు ఇష్టం ఏర్ప‌డింది. నువ్వు తోడుంటే స‌క్సెస్ ఫుల్ ప‌ర్స‌న్ ను అవుతా…నాతో జీవితాంతం తోడుంటావా..అంటూ ప్ర‌పోజ్ చేశాడు. ఇక మెహ‌బూబ్ ప్ర‌పోజ్ కు శ్వేత మురిసిపోతూ సిగ్గుప‌డుతోంది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. అయితే వీరిద్ద‌రూ నిజంగానే ప్రేమ‌లో ప‌డ్డారా.? లేదంటే జ‌నాల‌ను ఫూల్స్ ను చేసేందుకు ప్రాంక్ వీడియో చేశారా అన్న‌ది తెలియాల్సి ఉంది.

also read : అర్జున ఫాల్గుణ ట్రైల‌ర్ విడుద‌ల‌..అద‌ర‌గొట్టిన శ్రీవిష్ణు..!

Visitors Are Also Reading