లేడీ సూపర్ స్టార్ నయనతార అన్నపూర్ణణి సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా ఇప్పుడు వివాదాల్లోకి చిక్కుకుంది. ఈ సినిమా శ్రీరాముడుని కించపరిచేలా ఉందని ముంబై పోలీసులకి ఫిర్యాదు చేశారు. శ్రీరాముడు మాంసాహారి అని, వాల్మీకి అయోధ్యకాండలో ఉంది అని, ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. దీంతో సినిమా చూసిన మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేష్ సోలం కి కొన్ని సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకి కంప్లైంట్ చేశారు. దీంతో నయనతార మీద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ విషయంపై తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు.
Advertisement
Advertisement
హోమ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కి లేఖ రాశారు. సినిమాని నిర్మించిన జి స్టూడియోస్ ని పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇటువంటి సినిమాలు చాలా వచ్చాయని ఇంకా భవిష్యత్తులో ఎవరు ఇటువంటి సినిమాలు తీయకుండా దర్శకనిర్మాతులు నటీనటుల పై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా కి విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సినిమాలు వచ్చాయి. ఇటువంటివి మళ్లీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే జీ స్టూడియోస్ ని పూర్తిగా నిషేధించాలని అన్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!