Telugu News » Blog » ముంబై ఇండియన్స్ గెలవాలంటే అలా చెయ్యాలి..!

ముంబై ఇండియన్స్ గెలవాలంటే అలా చెయ్యాలి..!

by Manohar Reddy Mano
Ads

ఐపీఎల్ 2022 లో రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు టైటిల్ సాధించిన ఏకైక జట్టుగా ఉన్న ముంబై.. వరుసగా ఆరు మ్యాచ్లు ఓడిన ఏకైక జట్టుగా చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ రోహిత్ కూడా ఈ వరుసగా కూటములకు కారణాలు తనకు తెలియడం లేదు అని చెప్పసాడు. ఈ జట్టు బ్యాటింగ్ లో కంటే.. బౌలింగ్ లో దారుణంగా విఫలమవుతున్నది.

అయితే తాజాగా ముంబై ఇండియాన్స్ మాజీ ఆటగాడు న్యుజిలాండ్ పేవర్ మిచెల్ మెక్‌క్లెనాఘన్ ఈ జట్టు గెలవాలంటే ఏం చేయాలో చెప్పాడు. ముంబై గురించి తాజాగా మెక్‌క్లెనాఘన్ మాట్లాడుతూ… నేను ఈ ప్రాంచైజీ తరపున ఆడటం నా అదృష్టం. నేను ఉన్న సమయంలో మలింగా, బుమ్రా, జాన్సెన్ వంటి అద్భుతమైన బౌలర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇప్పుడు అదే తరహా బౌలింగ్ యూనిట్ ఈ జట్టులో ఉంది. అలాగే ప్రస్తుతం ముంబై బౌలింగ్ కోచ్ లుగా షేన్ బాండ్, జహీర్ ఖాన్ ఉన్నారు.

అందువల్ల ఈ జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్లు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే.. వారు అత్యుత్తమ కోచ్ ల వద్దా శిక్షా తీసుకుంటున్నారు. కాబట్టి వీరు రాణించాలంటే పెద్దగా చేయాల్సింది ఏం లేదు. మీ కోచ్ లను నమ్మండి. వారు ఏం చెప్తే అదే చేయండి అని మెక్‌క్లెనాఘన్.. రాణించలేకపోతున్న ముంబై బౌలర్లకు సూచించాడు. ఇదిలా ఉంటె ముంబై జట్టు తమ తదుపరి మ్యాచ్ ఈ నెల 21న చెమ్మై సూపర్ కింగ్స్ తో ఆడబోతుంది.

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ వల్లే బ్యాటర్లు నన్ను ఉతుకుతున్నారు : భువీ

వార్నర్ కూతుర్లను ఏడిపించిన హాసరంగా…!


You may also like