Home » భార్యా పిల్లల విషయంలో మగవాళ్ళు అసలు చేయకూడని తప్పులు..!!

భార్యా పిల్లల విషయంలో మగవాళ్ళు అసలు చేయకూడని తప్పులు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ సమాజంలో చాలామంది మగవాళ్లకు ఇంట్లో ఉండే తన భార్యతో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియదు. వారితో ఎలా ఉండాలో అంతకంటే తెలియదు. భార్యను ఓ పది మంది ఉన్న సమయంలోనే కోప్పడటం చేస్తూ ఉంటారు. కానీ భార్య పిల్లల విషయంలో పురుషులు అతిగా ప్రవర్తించడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

#1.భార్య విషయంలో చేయకూడని పనులు:

Advertisement

also read:90 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డాడు..ఏకంగా తన ఆస్తి మొత్తాన్ని ..!!

చాలామంది భర్తలు వారి భార్యలను చీప్ గా చూస్తూ నువ్వు నా కాళ్ళకిందే ఉండాలని భావనతో ఉంటారు. కానీ అలాంటి భావాలను తీసివేయాలని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా భార్య తరపు తల్లిదండ్రులతో గొడవకు దిగకూడదని అంటున్నారు. అంతేకాకుండా భార్య వండిన పదార్థాలను ఎప్పుడు కూడా విస్మరించకూడదని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా భార్య ఇంటిని ఒక జైలులా భావిస్తే మీకు అనేక ఇబ్బందులు వస్తాయని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వారానికి ఒక్కసారైనా భార్యను బయటకు తీసుకొని వెళ్లాలని, వారి ఇష్ట ఇష్టాలు తెలుసుకొని వాటిని తీర్చాలని, భర్య అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని అంటున్నారు నిపుణులు.

Advertisement

#2.పిల్లల విషయంలో జాగ్రత్తలు :

ముఖ్యంగా ఇంట్లో మగవాళ్ళు పిల్లలతో చాలా సరళంగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడకూడదని, పిల్లల ముందే భార్యతో చనువుగా ప్రవర్తించకూడదని అంటున్నారు. ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ పెరుగుతారు కాబట్టి వారి ముందు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఒకే ఒక్క గదిలో నివసించే భార్యాభర్తలు పిల్లలను గమనిస్తూ వారికి తగినట్టుగా ప్రవర్తించాలి. వారు లేని సమయంలోనే మీ ఇతర కార్యక్రమాలు చేయాలని నీపుణులు అంటున్నారు. అంతేకాకుండా పిల్లల విషయంలో భర్తగా మీరు ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించి దానికి అనుగుణంగా తీర్చిదిద్దితే మీ కుటుంబం సంతోషంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

also read:సీఎం జగన్ ట్వీట్ పై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ …!

Visitors Are Also Reading