Home » భీమ్లా నాయ‌క్ లో బిగ్ మిస్టేక్….ఇది కూడా చూసుకోరా గురూజీ అంటూ ప్రేక్ష‌కులు ఫైర్..!

భీమ్లా నాయ‌క్ లో బిగ్ మిస్టేక్….ఇది కూడా చూసుకోరా గురూజీ అంటూ ప్రేక్ష‌కులు ఫైర్..!

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌గ్గుబాటి రానా క‌లిసి న‌టించిన సినిమా భామ్లానాయక్. ఈ సినిమాకు సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వహించారు. అంతే కాకుండా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాట‌ల‌తో పాటూ స్క్రీన్ ప్లే ను అందించారు. ఇక ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు భార్య‌గా నిత్యామీన‌న్ న‌టించ‌గా రానాకు భార్యాగా మ‌ల‌యాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా న‌టించింది.

also read: RRR Review : ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులు కొల్ల‌గొట్ట‌డం ఖాయం..!

Advertisement

 

ఇక ఫ్రిబ్ర‌వ‌రి 25న థియేట‌ర్ ల‌లో విడుద‌లైన ఈ సినిమాకు మిక్డ్స్ టాక్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు క‌లెక్ష‌న్ లు కూడా త‌క్కువ రావ‌డంతో బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోయిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సినిమాల‌ను థియేట‌ర్ లలో చూస్తే కేవ‌లం ఎంజాయ్ చేసేవారు. కానీ సినిమా మార్చి 24న ఆహా మ‌రియు డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో విడుదలైన సంగ‌తి తెలిసిందే.

Advertisement

కాగా సినిమాలోని ఓ బిగ్గెస్ట్ మిస్టేక్ ను ప్రేక్ష‌కులు పట్టుకున్నారు. అస‌లు ఇంత చిన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యారు అంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాలో డానియ‌ల్ శేఖ‌ర్ ను అరెస్ట్ చేసినప్పుడు ఏడ్చిన‌ట్టు న‌టించి ప‌వ‌న్ క‌ల్యాణ్ తో గ్లాస్ లో మ‌ద్యం పోయించుకుంటాడు. అయితే ఆ స‌మ‌యంలో డానియ‌ల్ శేఖ‌ర్ వీడియో తీస్తాడు. అంతే కాకుండా జైలు నుండి విడుద‌ల కాగానే ఆ వీడియోను మీడియా వాళ్లకు పంపిస్తాడు. దాంతో ఆ న్యూస్ టీవీలో రావడంతో పాటూ భీమ్లానాయ‌క్ ను అరెస్ట్ చేస్తారు.

కానీ పోలీస్ స్టేష‌న్ లో ఒకేసారి వారానికి సంత‌కాలు పెట్టి అక్క‌డ నుండి వెళ్ల‌డానికి రానా ఫోన్ లో ఉన్న వీడియోను ఇవ్వాల‌ని అది ఎస్పీ వ‌ద్ద‌కు వెళ్ల‌కూడ‌ద‌ని కోరుతారు. కానీ డానియ‌ల్ ఆ ఫోన్ తీసుకురాడు. దాంతో స్టేష‌న్ లో పోలీసులు గోల గోల చేసేస్తారు. అయితే అప్ప‌టికే టీవీ లో వ‌చ్చిన వీడియో ఎలాగూ వైర‌ల్ అవుతుంది. మ‌ళ్లీ దానికోసం రానా చెప్పిన‌ట్టు చేయ‌డంతో అక్క‌డ ద‌ర్శ‌కుడు బిగ్ మిస్టేక్ చేసిన‌ట్టు క్లారిటీగా క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలోనే భీమ్లానాయ‌క్ పై ట్రోల్స్ వ‌స్తున్నాయి. గురూజీ త్రివిక్ర‌మ్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ ప్రేక్ష‌కులు ఫైర్ అవుతున్నారు.

Also Read: RRR : అంత పెద్ద సినిమాలో ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యారేంటి..?

Visitors Are Also Reading