Telugu News » Blog » ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించిన‌ మిస్ యూనివ‌ర్స్‌..!

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించిన‌ మిస్ యూనివ‌ర్స్‌..!

by Anji
Ads

మిస్ యూనివ‌ర్స్ హ‌ర్నాజ్ కౌర్‌శ్రీ సంధు సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించింది. తాను సెలియాక్ డిసీజ్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలిపింది. అందుకే బ‌రువు పెరిగిన‌ట్టు పేర్కొంది. ఇటీవల లాక్మే ఫౌండేష‌న్ ఫ్యాష‌న్ షోలో మెరిసిన హ‌ర్నాజ్ సంధుపై సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ట్రోలింగ్ జ‌రిగింది. సంధు బాగా బ‌రువు పెరిగిపోయింద‌ని ఆమె ప్ల‌స్ సైజ్ మోడ‌ల్ అని నెటిజ‌న్లు ట్రోల్ చేశారు.

Ads

ఈ ట్రోల్స్‌పై సంధు స్పందిస్తూ.. తాను బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణం సెలియాక్ డిసీజ్ అని వెల్ల‌డించింది. ఈ విష‌యం ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌ద‌ని పేర్కొంది. డిసీజ్ కార‌ణంగానే తానెంతగా ప్ర‌య‌త్నించినా మ‌ళ్లీ లావెక్కుతున్న‌ట్టు తెలిపింది. చంఢీగ‌డ్‌లో ఈవెంట్‌లో పాల్గొన్న స‌మ‌యంలో హ‌ర్నాజ్ సంధు ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. లావుగా ఉన్నా.. స‌న్న‌గా ఉన్నా తాను చాలా ఆత్మ‌విశ్వాసం, ధైర్యం క‌లిగిన అమ్మాయిని అని సంధు పేర్కొంది. త‌న బాడీని తాను ప్రేమిస్తాన‌ని తెలిపింది.

Ads

Also Read :  నేడే బీస్ట్ ట్రైల‌ర్‌.. ఏడు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన డైరెక్ట‌ర్


మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే గ్లుటెన్‌, ప్రోటీన్ చిన్న ప్రేగుపై ప్ర‌భావం చూపిస్తుంది. దాని కార‌ణంగా సెలియాక్ వ్యాధి బారిన‌ప‌డే అవ‌కాశ‌ముంటుంది. సెలియాక్ వ్యాధితో బాధప‌డే వార‌కి కావాల్సిన పోష‌కాల‌న్నీ అంద‌వు. దాని కార‌ణంగా సెలియాక్ వ్యాధి బారిన ప‌డే అవ‌కాశం ఉంటుంది. దీంతో అనీమియా ఎముక‌ల బ‌ల‌హీన‌త వంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు రావ‌చ్చు. ఈ వ్యాధితో బాధ‌ప‌డేవారు ఆహారంలో గ్లుటెన్ లేకుండా చూసుకోవాలి. ఈ వ్యాధికి ప్ర‌స్తుతం నివార‌ణ లేదు. డైట్‌ను నియంత్ర‌ణ‌లో పెట్టుకోవ‌డం ద్వారా నియంత్ర‌ణ‌లో ఉంచ‌వ‌చ్చు.

Ad

Also Read :  నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. పోలీస్ ఉద్యోగాల‌కు స‌న్న‌ద్దం అవుతున్న వారికి ఉచిత కోచింగ్