Home » మిస్ ఇండియా కూడా దేవరకొండ ఫ్యానే..!

మిస్ ఇండియా కూడా దేవరకొండ ఫ్యానే..!

by Azhar
Ad
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అందర్నీ షాక్ కు గురి చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో పెళ్లి చూపులు సినిమాతో హిట్ అందుకొని వరుస అవకాశాలు అనేవి అందుకున్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో విపరీతమైన ఫ్యాన్ బేస్ అనేది ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండ.. తన యాటిట్యూడ్ తో కూడా ఇంకా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ పాన్ ఇండియా సినిమా కూడా చేస్తున్నాడు.
అయితే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా అనేది బాలీవుడ్ లో రీమేక్ కావడం వల్ల అక్కడ కూడా ఈ రౌడీ హీరోకు అభిమానులు పెరిగారు. అందుకే ఇప్పుడు విజయ్ తీస్తున్న పాన్ ఇండియా సినిమా లైగర్ కు విపరీతమైన క్రేజ్ అనేది ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్న బాలీవుడ్ హీరోయిన్స్ చాలా మంది విజయ్ దేవరకొండ తమ ఫెవరెట్ హీరో అని చెబుతున్నారు. జాన్వీ కపూర్ గాని సారా అలీఖాన్ ఇలా అందరూ విజయ్ ఫెవరెట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో అమ్మడు కూడా విజయ్ అంటేనే ఇష్టం అంటుంది.
మిస్ ఇండియా గా ఎంపికైన కన్నడ యువతి సినీ శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడ మీ ఫెవరెట్ హీరో ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. విజయ్ దేవరకొండ అంటే నాకు చాలా ఇష్టం అని పేర్కొంది. ఇక అతడిని కలిసే అవకాశం వస్తే మాత్రం నాకంటే ఎవరు ఎక్కువ హ్యాపీ పర్సన్ ఉండరు అంటూ పేర్కొంది. ఇక ఈ మధ్యే విజయ్ దేవరకొండ యొక్క లైగర్ సినిమా ట్రైలర్ అనేది విడుదల ిన విషయం తెలిసిందే. దీనికి మన తెలుగుతో పాటుగా హిందీలో కూడా విపరీతమైన ఆదరణ అనేది లభించింది. ముంబైలో చేసిన ఈ ఈవెంట్ కి ఫ్యాన్స్ భారీగా వచ్చారు.

Advertisement

Visitors Are Also Reading