మైనార్టీ పిల్లలకు కార్పోరేట్ స్థాయి విద్యావకాశాలు కల్పించేందుకై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ మైనారిటీ గురుకులాలను ప్రారంభించింది. ఈ గురుకులాలు ఆశించిన ఫలితాలను సాధిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచాయి. ఇంతవరకు బాగానే ఉన్నా…… మైనార్టీ గురుకుల సొసైటీలు తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ఉపాధ్యాయులను ఇబ్బందికి గురిచేసేవిగా ఉన్నాయి. తెలంగాణ సర్కార్ PRC ప్రకటించి 18 నెలలు గడుస్తున్నా మైనార్టీ సొసైటీల్లో చాలా మంది ఉద్యోగులకు PRC ఎరియర్స్ ను చెల్లించలేదు. ఈ విషయంపై సొసైటీని సంప్రదించినా తమకు సరైన సమాధానం రావట్లేదంటున్నారు ఉద్యోగులు. దీనికి తోడు DA ఎరియర్స్ ను కూడా తమ ఖాతాల్లో జమ చేయలేదని ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement
తెలంగాణలో మైనార్టీ గురుకులాలతో పాటు బిసి, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు కూడా ఉన్నాయి. అన్ని గురుకులాలు తమ ఉద్యోగులకు PRC ఎరియర్స్ ను చెల్లించాయి. కానీ వాటన్నింటికి భిన్నంగా మైనార్టీ గురుకుల సొసైటీ వ్యవహరిస్తుందంటున్నారు టెమ్రీస్ టీచర్స్. ప్రమోషన్స్ విషయంలో, పిఆర్సీ జాప్యం అవుతున్న విషయంలో స్పష్టమైన సమాధానమివ్వకుండా దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారు. సొసైటీలో అనుభవజ్ఞులైన అధికారులు లేని కారణంగా ప్రతి విషయంలో జాప్యం జరుగుతుందని ఆరోపిస్తున్నారు తెలంగాణ మైనార్టీ గురుకుల ఉద్యోగులు.ఈ విషయాలపై అనేక సార్లు సెక్రెటరీని కలిసినా ఎలాంటి ఫలితం రాలేదంటున్నారు ఉద్యోగులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి PRC బకాయిలను చెల్లించాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు