సీఎం జగన్‌కు మంత్రులు రాజీనామా పత్రాలు సమర్పించారు. అందరి మంత్రుల వద్ద నుంచి రాజీనామా పత్రాలను జగన్ తీసుకున్నారు. మొదట కేబినేట్ సమావేశానికి రాజీనామా లేఖలతోనే వచ్చిన మంత్రులు ముఖ్యమంత్రికి సమర్పించారు. మంత్రుల రాజీనామా లేఖలను జీఏడీ అధికారులు సాయంత్రం గవర్నర్‌కు పంపమన్నారు. గవర్నర్ ఆమోదించగానే ప్రస్తుత మంత్రులంతా మాజీ మంత్రులవుతారు. అలాగే ఈనెల 10న కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు సీఎం జగన్ పంపనున్నారు. ఈనెల 11న కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నది.
కాసేపట్లో ఏపీ కేబినేట్ సమావేశం ముగియనుంది. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణే లక్ష్యంగా సమావేశం జరుగనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సీఎం జగన్ మంత్రులకు పార్టీ నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు. ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గంలో వారిని ఎందుకు కొనసాగించాలని అనుకుంటున్నారనే విషయాలను క్యాడర్‌కు చెప్పనున్నారు. ఐదారుగురు మంత్రులు తప్ప మిగిలిన వారందరూ రాజీనామా చేస్తారని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement
మరొక వైపు మూడు సంవత్సరాల పాటు మంత్రిగా వ్యవహరించానని.. పేర్ని నాని గురించి తెలుగు ప్రజలు తెలుసుకుంటారంటే అందుకు కారణం సీఎం జగన్మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. ఎవరితోనైనా విధి నిర్వహణలో భాగంగా తెలిసో తెలియకో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే మన్నించండి అని కోరారు మంత్రి పేర్ని నాని. మరోకవైపు కేబినెట్ చివరగా జనగ్ ఈనెల 11న మంత్రులు అందరూ అందుబాటులో ఉండండి. మీలో ఐదారుగురు మంత్రి వర్గంలో కొనసాగుతారు. ఎవరినీ పార్టీకి వాడాలో.. ఎవరినీ కో ఆర్డినేటర్‌గా వాడాలి. ఎవరినీ మంత్రిగా అభివృద్ధికి వాడాలో సీఎం నిర్ణయిస్తారు. సీఎం మనసులో ఎవరున్నారో తెలియక అందరిలోనూ టెన్షన్ నెలకొంది.
Also Read : Viral Video : ఆత్రం ఆపుకోలేకపోయిన పెళ్లికొడుకు.. సిగ్గుతో తలలు దించుకున్న అతిథులు..!