ఏపీ మంత్రి పేర్నినాని నేడు మోహన్ బాబు ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా నిన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి టాలీవుడ్ లో సీనియర్ నటుడుగా ఉన్న మోహన్ బాబు మాత్రం హాజరవ్వలేదు.
Advertisement
అంతే కాకుండా సమావేశం అనంతరం సమస్యలు తీరిపోయాయని అటు సీనీ పెద్దలు మరియు సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో మోహన్ బాబు ఇంట్లో పేర్నినాని ప్రత్యక్షం అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి పేర్నినాని నేడు ఓ వివాహవేడుకకు హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. వివాహ వేడుక అనంతరం పేర్నినాని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు.
Advertisement
సినీపరిశ్రమకు చెందిన అంశాలపై పేర్నినాని తో మోహన్ బాబు చర్చించినట్టు సమాచారం. మరోవైపు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు పేర్నినానితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. మా ఇంట్లో మీకు ఆతిద్యం ఇవ్వడం మా అదృష్టం. టికెట్ ధరల సమస్యలను తీర్చుతున్నందుకు కృతజ్ఞతలు మరియు ఏపీ ప్రభుత్వం సినీపరిశ్రమ భాగు కోసం తీసుకుంటున్న నిర్ణయాలను మాకు తెలిపినందుకు కృతజ్ఞతలు…అంటూ మంచు విష్ణు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక నిన్న మోహన్ బాబు మంచు విష్ణు సినీప్రముఖులతో భేటీలో పాల్గొనలేదని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా మోహన్ బాబు ఇంటికే సినిమాటోగ్రాఫి మంత్రి వెళ్లడంతో అందరూ షాక్ అవుతున్నారు.