Home » పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పిన మంత్రి హరీష్ రావు..!!

పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పిన మంత్రి హరీష్ రావు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతున్న తెరాస ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో పది లక్షల కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అలాగే సొంతంగా స్థలం ఉంటే ఇల్లు నిర్మిస్తామని అన్నారు. దీంతోపాటుగా సంగారెడ్డిలో మహిళా సంఘాల సభ్యులకు అభయ హస్తం శ్రీనిధి కార్పస్ ఫండ్ ను మంత్రి ఎర్రబెల్లితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం మహిళా సంఘ సభ్యులు

Advertisement

500 రూపాయలు పింఛన్ల కోసం కట్టారని, వాటిని ఇప్పుడు కార్పస్ ఫండ్ కల్పిస్తున్నట్టు తెలియజేశారు. రాష్ట్రం మొత్తం ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చే కార్యక్రమం ప్రారంభం అయింది అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ 200 రూపాయల పింఛను 2016 చేశారని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని బ్యాంకు లింకేజీ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ అని అన్నారు. 672 కోట్ల రూపాయలతో బ్యాంకు లింకేజీ ఇచ్చామన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్

Advertisement

కళ్యాణ లక్ష్మి తో పేద ఆడబిడ్డలకు వివాహానికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. అలాగే ఇంటింటికి నల్ల కలెక్షన్ల ద్వారా సురక్షితమైన తాగునీటినీ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రిది అన్నారు. దేశం మొత్తం కరెంట్ కోతలున్నా కోతలు లేని రాష్ట్రం తెలంగాణ అన్నారు. బండి సంజయ్ బీజేపీ పాలించే రాష్ట్రాల్లో 2000 రూపాయల పింఛను ఇప్పించి పాదయాత్ర చేయాలని అన్నారు. ప్రజలను రెచ్చగొడుతూ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక 400 రూపాయల సిలిండర్ల ధర 1050 రూపాయలు చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

Visitors Are Also Reading