దాదాపు 27 ఏళ్ల తరువాత మైక్రోసాప్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌పై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ గురించి తెలియని వారు ఉండరు. ఇది మైక్రోసాప్ట్ అభివృద్ధి చేసిన ఓ గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్‌ల శ్రేణి, మైక్రోసాప్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ శ్రేణి కొరకు 1995 కాలంలో తొలిసారిగా విడుదలైంది. తొలుత యాడ్ ఇన్ ఫ్యాకేజీ ప్లస్‌ఫర్ విండోస్ 95లో భాగంగా విడుదల చేసారు.
Advertisement
ఆ తరవాత ఫ్రీ ఆప్ కాస్ట్‌లో మైక్రోసాప్ట్ అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ ఒకప్పుడు ఎక్కువగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్. 2003 నాటికి ఇది 95 శాతం వినియోగవాటా దీనిదే ఉండడం గమనార్హం. ఆ తరువాత కాలక్రమేణా ఈ వాటా తగ్గడం ప్రారంభం అయింది. 2004లో ఫైర్ ఫాక్స్, 2008లో గూగుల్ క్రోమ్ ప్రారంభమవ్వడంతో ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్‌కు మద్దతు తగ్గిపోసాగింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి ఆపరేటింగ్‌సిస్టమ్‌లకు పెరుగుతున్న ప్రజాధారణతో దీనిని వినియోగించే వాటా క్షీణించిపోయింది. ఇక అన్ని ఫ్లాట్ ఫారమ్‌లపై ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ మార్కెట్ వాటా 2.28 శాతం మాత్రమే ఉంది. అనగా దీని క్షీణత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Advertisement
తాజాగా మైక్రోసాప్ట్ ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్‌ని ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఓల్డెస్ట్ బ్రౌజర్‌కి ఇక రిటైర్మెంట్ ప్రకటించనున్నది. 27 ఏళ్ల పాటు ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ సేవలను అందించింది. జూన్ 15 నుంచి ఈ సేవలు అందుబాటులో ఉండవు. యూజర్ ఇంటర్ ఫేసెస్ మరింత సౌకర్యవంతంగా అందుబాటులోకి తేవడంతో ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ ప్రత్యామ్నాయం కానున్నదని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. మైక్రోసాప్ట్ ఎడ్జ్ అనేది భద్రతతో కూడిన వేగవంతమైన బ్రౌజింగ్ అనుభవం వినియోగదారులకు అందిస్తోంది.
Also Read :
రోజా మంత్రి కావద్దని ఇంద్రజ దేవుని కోరుకున్నారా…?
చిరంజీవికి సాయి పల్లవి నో ఎందుకు చెప్పిందో మీకు తెలుసా..?