Telugu News » Blog » కాబోయే భర్తను ఉద్యోగం నుంచి తొలగించిన ‘మైక్రోసాప్ట్’.. పెళ్లి చేసుకోమంటారా..?

కాబోయే భర్తను ఉద్యోగం నుంచి తొలగించిన ‘మైక్రోసాప్ట్’.. పెళ్లి చేసుకోమంటారా..?

by Anji
Ads

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం, కొన్ని కొత్తగా రిక్రూట్ మెంట్ ఇలా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా గూగుల్, మెటా, మైక్రోసాప్ట్ దిగ్గజ సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ప్రధానంగా సాప్ట్ వేర్ ఉద్యోగంపై ఆధారపడిన వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి ఓ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. 

Advertisement

Advertisement

తనకు కాబోయే వాడికి మైక్రోసాప్ట్ లో ఉద్యోగం పోయిందని.. ఇప్పుడు అతడిని పెళ్లి చేసుకోవచ్చా.. అని సలహా కోరుతూ ఓ యువతి ఆన్ లైన్ లో అడిగిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా “ కుటుంబ సభ్యులు మా ఇద్దరికీ పెళ్లి కుదిర్చారు. పిబ్రవరిలోనే ముహుర్తం ఖరారు అయింది. ఇక అంతలోనే నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని మైక్రోసాప్ట్ ఇండియా ఉద్యోగంలోంచి తొలగించింది. నా కుటుంబానికి ఈ విషయం తెలుసు. ఇప్పుడు అతడిని పెళ్లి చేసుకోవాలా.. వద్దా..? అనే విషయం అర్థం కావడం లేదు. అతడు ఉద్యోగం చేసే సమయంలో అతని వేతనం 2.5లక్షలుగా ఉండేది”  అని ఓ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

Also Read :  ఈ 3 యోగాసనాలు క్యాన్సర్ రాకుండా కాపాడగలవు అనే విషయం మీకు తెలుసా ? 

Microsoft to open a 4000-employee campus in Uttar Pradesh - The Economic  Times

ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. ఆ యువతి చేసిన పోస్ట్ పై రకరకాల స్పందనలు వస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన సంబంధాలు.. వ్యాపార లావాదేవీలు మారిన నేపథ్యంలో.. దీనిని అలాగే పరిగణించాలని కొందరూ స్పందించారు. అతనికి నీ కంటే మంచి వ్యక్తి దొరుకుతారని.. మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జనవరిలో మైక్రోసాప్ట్ సంస్థ 10వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ యువతి పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. 

Advertisement

Also Read :  ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలు.. 12 వేల జీతం.. పూర్తి వివరాలు ఇవే!