ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాప్ట్ తమ యాక్టివిజన్ బ్లిజార్డ్ తో సహా దాని వీడియో-గేమ్ విభాగాల్లో 1900 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్ ను మైక్రోసాప్ట్ కార్పొరేషన్ గత ఏడాది 69 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ మేరకు మైక్రోసాప్ట్ ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ ను బ్లూమ్ బెర్గ్ వార్త సంస్థ సమీక్షించింది.
Advertisement
Advertisement
మైక్రోసాప్ట్ 22,000 మంది గేమింగ్ వర్కర్లలో 8 శాతం మంది తొలగించనున్నట్టు ఈ మెయిల్ లో మైక్రోసాప్ట్ గేమింగ్ చీఫ్ పిల్ స్పెన్సర్ పేర్కొన్నారు. మైక్రోసాప్ట్ యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలును ఖరారు చేసిన మూడు నెలల్లోనే ఉద్యోగుల తొలగింపులు చేపట్టడం గమనార్హం. భవిష్యత్ కి అనుగుణంగా తమ వనరులను రీసెట్ చేయడానికే తొలగింపులు చేపడుతున్నట్టు యాక్టివిజన్ పబ్లిషింగ్ చీఫ్ రాబ్ కోస్టిచ్ ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో పేర్కొన్నట్టు బ్లూమ్ బర్గ్ నివేదించింది.