Michael Movie Review: సాధారణంగా కొంతమంది నటులు ఎన్ని మంచి పాత్రలు చేసిన ఎన్ని సినిమాలలో నటించిన అంతగా గుర్తింపు దక్కదు. అలా తెలుగులో చాలా సినిమాలలో నటించిన.. ఎన్నో పాత్రలకు మంచి గుర్తింపు వచ్చినా కూడా ఎందుకో సందీప్ కిషన్ కి రావాల్సిన గుర్తింపు రావడం లేదు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు సందీప్ కిషన్. గల్లీ రౌడీ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకొని మైఖేల్ అనే పాన్ ఇండియా సినిమాతో మళ్లీ మన ముందుకొచ్చాడు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Sundeep Kishan Michael Movie Review and Rating in Telugu
Advertisement
కథ
చిన్నప్పటి నుంచే పెద్ద గ్యాంగ్ స్టర్ అవ్వాలనే కలతో పెరుగుతాడు మైఖేల్. అనుకున్నట్టుగానే కొంచెం వయసు వచ్చిన తరువాత ఓ గ్యాంగ్ లో చేరుతాడు. అక్కడ తన పనితనంతో రోజు రోజుకు మంచి పొజిషన్ కి వెళ్తున్న సమయంలోనే తీర అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తనతో ప్రేమలో పడతాడు. తీర తన జీవితంలోకి వచ్చిన తరువాత మైఖేల్ లో వచ్చిన మార్పులు ఏంటి..? అసలు తీర ఎవరు..? తన గతం ఏంటి..? అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటులు
సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేష్, అయ్యప్ప శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ వంటి తారాగణం ఈ చిత్రంలో నటించారు. మైఖేల్ కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహించారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ, శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ బ్యానర్ లపై భరత్ చౌదరి, పుష్కుర్ రామ్ రామోహన్ రావు నిర్మించారు. సంగీతం సామ్ సి.ఎస్. సినిమాటోగ్రఫి కిరణ్ కౌశిక్ ఎడిటింగ్ ఆర్.సత్యనారాయణన్ వ్యవహరించారు.
Advertisement
Michael Movie Review : విశ్లేషణ
మైఖేల్ చిత్రం ఎలాంటి సమయాన్ని వృధా చేయకుండా డైరెక్ట్ కథలోకి వెళ్లారు దర్శకుడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో కేవలం పాత్రలను పరిచయం చేసి కథని ఎక్కువగా చూపించకుండా జాగ్రత్తపడ్డాడు. తొలుత కాస్త ఉత్కంఠగా అనిపించినా.. కొన్ని సన్నివేశాల తరువాత ఆ ఉత్కంఠని ఎక్కువ సేపు కొనసాగించలేకపోయారు. మధ్య మధ్యలో కొన్ని సాగదీసిన సీన్లతో అక్కరలేని డైలాగ్స్ తో ఇంటర్వెల్ వరకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ కి ముందు ఓ ట్విస్ట్ తో కాస్త ఆసక్తి ఉంటుంది. ద్వితీయార్థానికి వచ్చే సరికి కొన్ని అవసరం లేని సీన్లతో బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ కి వచ్చే సరికి యాక్షన్ ఎక్కువగా ఉంటుంది.
నటన విషయానికొస్తే.. గత చిత్రాలతో పోల్చితే సందీప్ కిషన్ అన్ని క్యారెక్టర్లు ఒకేవిధంగా ఉన్నాయనిపిస్తుంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ తన పాత్రలో లీనమైనప్పటికీ ఎందుకో తన నటన కొంచెం నేచురల్ గానే అనిపిస్తుంది. ఆ పాత్ర కోసం తన శరీరాన్ని మార్చుకున్న తీరు అందరూ మెచ్చుకుంటారు. దివ్యాంశ కౌశిక్ తన నటనతో ఈచిత్రంలో ఆకట్టుకోలేకపోయిందనే చెప్పవచ్చు. కొద్దిసేపు విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ నటనతో ఆకట్టుకుంటున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన నటనతో మనల్ని బాగానే ఎంటర్టైన్ చేస్తాడు. వరుణ్ సందేశ్ మాత్రం తన పాత్రకు సరిపోలేదనిపిస్తుంది. అయ్యప్ప శర్మ డైలాగ్ డెలివరీ బాగుంది. సాంకేతికపరంగా మైఖేల్ చిత్రం చాలా బాగుంది. కానీ సామ్ సిఎస్ పాటలు ఆకట్టుకోలేదనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. దర్శకుడు రంజిత్ జయకోడి ఎంచుకున్నటువంటి కథ కొత్తది కాకపోయినా దానిని నడిపించిన తీరు కొంతమేరకు మెప్పిస్తుంది. మొత్తానికి యాక్షన్ తో నిండిన ఓ కొత్త ప్రపంచమే మైఖేల్.
ప్లస్ పాయింట్స్ :
- నేపథ్య సంగీతం
- సినిమాటోగ్రఫి
- యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
- స్లో నేరేషన్
- అనవసరమైన కొన్ని పాత్రలు
రేటింగ్ : 2.75/ 5
Also Read : K Viswanath : కళాతపస్వి విశ్వనాథ్ ఇకలేరు..!