Telugu News » ప్రియురాలి తల్లికి కిడ్నీ దానం చేసిన ప్రియుడు…నెల తిరక్కుండానే షాక్ ఇచ్చిన ప్రేయసి ..!

ప్రియురాలి తల్లికి కిడ్నీ దానం చేసిన ప్రియుడు…నెల తిరక్కుండానే షాక్ ఇచ్చిన ప్రేయసి ..!

by AJAY MADDIBOINA

ప్రేమంటేనే త్యాగం. ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. అయితే ఎన్ని త్యాగాలు చేసినా కొన్నిసార్లు ఆ ప్రేమ సఫలం కాకపోవచ్చు. తాజాగా ఓ యువకుడు తన ప్రేయసి కోసం ఎవరు చేయలేని త్యాగం చేశాడు. ఏకంగా ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. అయినప్పటికీ ఆ ప్రేయసి కరుణించలేదు. ఇంతకీ ఆ ప్రియుడు ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. మెక్సికో లో టీచర్ గా పని చేస్తున్న ఉజియెల్ మార్టినేజ్ అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు.

అయితే ఇద్దరూ ప్రేమలో ఉన్న సమయంలో ప్రేయసి తల్లికి ఒక కిడ్నీ చెడిపోయింది. దాంతో తన ప్రేయసి బాధను చూడలేకపోయాడు. తానే కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమయ్యాడు. అన్ని పరీక్షలు పూర్తవడం అతడి కిడ్నీ పేషంట్ కు సరిపోతుందని డాక్టర్ లు గుర్తించడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిపోయింది. ఆ తర్వాత నెల రోజుల వరకు అంతా బాగానే ఉంది.

 

కానీ అంతలోనే ప్రియుడికి ప్రేయసి షాకిచ్చింది. బ్రేకప్ చెప్పి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే రీసెంట్ గా టిక్ టాక్ లో ఓ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ లో భాగంగా మార్టినెజ్ తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించాడు. దాంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దాంతో మార్టినేజ్ గర్ల్ ఫ్రెండ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంతో మంచి వ్యక్తిని ఆ అమ్మాయిని మిస్ చేసుకుందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You may also like