Home » మెట్రో ట్రాకుల మధ్య రాళ్లు ఎందుకు ఉండవో తెలుసా..?

మెట్రో ట్రాకుల మధ్య రాళ్లు ఎందుకు ఉండవో తెలుసా..?

by Sravanthi
Ad

సాధారణంగా మనం రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు రైల్వే ట్రాకులను చూసే ఉంటాం. అవి చూసినప్పుడు మనకు ఆ ట్రాక్ మధ్యలో కంకర రాళ్లు కనిపిస్తాయి.. అయితే ఇది సాధారణ రైల్వే ట్రాక్ ల మధ్య కనిపించే దృశ్యం. కానీ మెట్రో ట్రాక్ ల మధ్య ఇలా కంకర ఉండదు.. మరి ఈ రెండు ట్రాక్ ల మధ్య తేడా ఏంటి అనేది మీరు ఎప్పుడైనా గమనించారా.. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణ రైల్వే ట్రాక్ ల మధ్య ఉండే కంకరరాళ్లను బాలస్ట్ అంటారు. ట్రైన్ పట్టాలపై నడుస్తున్న సమయంలో బలమైన శబ్దం చేస్తు వెళ్తుంది.

Advertisement

also read:మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్న చైసామ్…త్వ‌ర‌లోనే విడాకుల ర‌ద్దు..?

Advertisement

ట్రాక్ పై ఉండే ఈ రాళ్లు ఆ శబ్దాన్ని తగ్గిస్తాయి. స్లీపర్లు అని పిలిచే ట్రాక్ దిగువ కనిపించే స్ట్రిప్ ను వైబ్రేషన్ సమయంలో పట్టాలు పట్టకుండా నిరోధిస్తూ ఉంటాయి. ట్రాక్ మధ్య భాగంలో కనిపించే ఈ బాలస్టుల ఎంతో నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. వీటి నిర్వహణ ప్రక్రియ కారణంగానే ఆ రైల్వే ట్రాక్ లను బ్లాక్ చేయాల్సి వస్తుంది. అదే మెట్రో ట్రాకుల మధ్య ఇలాంటి దృశ్యం కనిపించదు. వీటిని బాలస్టులతో బ్లాక్ చేయడం సాధ్యం కాదు. చాలావరకు మెట్రో ట్రాక్ లు భూమి దిగువ బాగాన లేదంటే భూమి మీది బాగాన ఉంటాయి. ఈ క్రమంలో బాలాష్టు ట్రాక్ నిర్వహించడం సాధ్యం కాదు. మెట్రో రైల్ లో ఫ్రీక్వెన్సీ దాదాపు ప్రతి ఐదు నిమిషాలకు ఓసారి ఉంటుంది.

కాబట్టి ఈ ట్రాకులను బ్లాక్ చేయడం సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే మెట్రో ట్రాక్ ల మధ్య రాళ్లు లేకుండా కాంక్రీట్ తో తయారు చేస్తూ ఉంటారు. అయితే మెట్రో ట్రాక్ తయారీ ఖర్చు ఎక్కువైనా సరే వాటి నిర్వహణ వ్యయం చాలా తక్కువ. ఈ విధంగా బాలేస్టు లేకుండా నిర్వహించే ట్రాకులు వైబ్రేషన్ ను గ్రహించేందుకు వివిధ డిజైన్లు ఉంటాయి.

also read:

Visitors Are Also Reading