Home » భార‌త క్రికెట్ మాజీ కెప్టెన్ త‌ల‌లో మెట‌ల్ ప్లేట్‌.. 60 సంవ‌త్స‌రాల త‌రువాత తొల‌గింపు

భార‌త క్రికెట్ మాజీ కెప్టెన్ త‌ల‌లో మెట‌ల్ ప్లేట్‌.. 60 సంవ‌త్స‌రాల త‌రువాత తొల‌గింపు

by Anji
Ad

నారీ కాంట్రాక్ట‌ర్ గురించి ప్ర‌స్తుతం ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు. 1950-60 మ‌ధ్య కాలంలో మాత్రం అంద‌రికీ ప‌రిచ‌య‌మైన వ్య‌క్తే కావ‌డం విశేషం. ఎందుకంటే ఆ స‌మ‌యంలో భార‌త క్రికెట‌ర్‌గా గుర్తింపు పొందాడు. అత‌ను భార‌త క్రికెట్ జ‌ట్టుకు కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. ప్ర‌స్తుతం అత‌ని గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నార‌నే మీకు డౌట్ రావ‌చ్చు. మీకు వ‌చ్చిన డౌట్ క్లియ‌ర్ చేయ‌డానికి ఇప్పుడు అత‌ని స్టోరీని కొంచెం తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

Advertisement

బౌన్స‌ర్ దాటికి నారీ కాంట్రాక్ట‌ర్ త‌ల‌కు తీవ్ర‌మైన దెబ్బ‌త‌గ‌ల‌డంతో అత‌ని కెరీర్ అర్థంత‌రంగా ముగిసిపోయింది. ఆ త‌రువాత అత‌ని త‌ల‌లో ఓ మెట‌ల్ ప్లేట్ అమ‌ర్చారు. ఇదంతా 1962లో జ‌రిగిన క‌థ‌. క‌ట్ చేస్తే.. 60 ఏళ్ల త‌రువాత వైద్యులు నారీ కాంట్రాక్ట‌ర్ త‌ల‌లో నుంచి మెట‌ల్ ప్లేట్‌ను విజ‌య‌వంతంగా తొల‌గించారు. ప్ర‌స్తుతం నారీ కాంట్రాక్ట‌ర్ వ‌య‌స్సు 80 సంవ‌త్స‌రాలు. మెట‌ల్ ప్లేట్ తొల‌గించిన త‌రువాత అత‌ని ఆరోగ్యం బాగానే ఉంద‌ని అత‌ని కుమారుడు హెషెడ‌ర్ వెల్ల‌డించారు.

Advertisement

భార‌త జ‌ట్టు 1962లో వెస్టిండిస్‌లో ప‌ర్య‌టించింది. ఆ ప‌ర్య‌ట‌నే నారీ కాంట్రాక్ట‌ర్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు ప‌లుకుతుంద‌ని బ‌హుశా ఊహించి ఉండ‌డు. విండిస్ టెస్ట్ మ్యాచ్ సంద‌ర్భంగా ఆ జ‌ట్టు బౌల‌ర్ వేసిన బౌన్స‌ర్ నారీ కాంట్రాక్ట‌ర్ త‌ల‌కు బ‌లంగా త‌గిలింది. దీంతో క్రీజులోనే కుప్ప‌కూలాడు నారీ కాంట్రాక్ట‌ర్. వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించి ఆ త‌రువాత భార‌త్‌కు పంపించారు. త‌మిళ‌నాడుకు చెందిన డాక్ట‌ర్ చండీ ఆధ్వ‌ర్యంలో నారీ కాంట్రాక్ట‌ర్ త‌ల‌కు త‌గిలిన దెబ్బ‌ను ప‌రిశీలించి మెట‌ల్ ప్లేట్ అమ‌ర్చారు.

ఇక అప్ప‌టి నుంచి బాగానే ఉన్న‌ప్ప‌టికీ ఈ మ‌ధ్య స్కానింగ్ చేయ‌గా.. మెట‌ల్ ప్లేట్ వ‌ల్ల చ‌ర్మం ఊడిపోతూ వ‌చ్చింది. దీంతో వైద్యుల స‌హా మేర‌కు ఆప‌రేష‌న్ నిర్వ‌హించి త‌ల‌లోని మెట‌ల్ ప్లేట్ను తొల‌గించారు. కాంట్రాక్ట‌ర్ త‌ల‌కు దెబ్బ త‌గ‌ల‌డానికి ముందే ఔట‌య్యే అవ‌కాశం వ‌చ్చింది. నారీ ఇచ్చిన క్యాచ్ విండిస్ ఫీల్డ‌ర్ విడిచిపెట్టాడు.. దీంతో బౌన్స‌ర్ ఆడి శాశ్వ‌తంగా క్రికెట్‌కు దూరం అయ్యాడు నారీ కాంట్రాక్ట‌ర్‌. భార‌త జ‌ట్టు త‌రుపున 1955-62 మ‌ధ్య కాలంలో 31 టెస్ట్‌ల్లో 1611 ప‌రుగులు సాధించాడు. ఓ సెంచ‌రీ, 11 హాఫ్ సెంచ‌రీలున్నాయి. 1955-62 మ‌ధ్య కొంత కాలం టీమిండియా కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు.

Also Read :  ‘నాటు నాటు’ పాటకి బాలయ్య, చిరులు స్టెప్స్ వేస్తే ఎలా ఉంటుందో చూస్తారా ?ఇదిగో వీడియో !

Visitors Are Also Reading