Home » ర‌ష్యాపై సోషల్‌ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం..!

ర‌ష్యాపై సోషల్‌ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం..!

by Anji
Ad

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండ‌యాత్ర కొన‌సాగిస్తున్న త‌రుణంలో సోష‌ల్ మీడియా దిగ్గ‌జం మెటా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మెటా ప‌రిధిలోని ఫేస్‌బుక్‌లో ర‌ష్య‌న్ మీడియాకు సంబంధించిన అడ్వ‌ర్‌టైజ్‌మెంట్ల‌ను నిషేదిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అంతేకాదు ఫేస్‌బుక్ వేదిక‌గా ర‌ష్య‌న్ మీడియాకు ఆదాయం సంపాదించే మార్గాల‌న్నింటిని మూసివేస్తున్న‌ట్టు కూడా వెల్ల‌డించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ నిర్ణ‌యం అమ‌లులోకి రానున్న‌ది.

Advertisement

 

మెటా ఆధ్వ‌ర్యంలో ప్ర‌స్తుతం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న స‌మాచారం మేర‌కు ఫేస్‌బుక్ ప్లాట్ ఫామ్‌పై నిషేదం అమ‌లులోకి రానున్న‌ది. మిగిలిన ప్లాట్‌ఫామ్స్ విష‌యంలో ఇంకా క్లారిటీ లేదు. మెటా తీసుకున్న తాజా నిర్ణ‌యంతో ర‌ష్య‌న్ మీడియా నుంచి వ‌చ్చే స‌మాచారం ఇక‌పై ఫేస్‌బుక్‌లో క‌నిపించ‌వు. అదేవిధంగా చాలా వ‌ర‌కు ర‌ష్య‌న్ వీడియోలు, ఇత‌ర స‌మాచారం కూడా ఫిల్ట‌ర్ అవ్వ‌నుంది.ర‌ష్యా క‌మ్యూనిస్టు దేశం కావ‌డంతో అక్క‌డ మీడియా స్వేచ్ఛ ప‌రిమితం ప్ర‌భుత్వం క‌నుస‌న్న‌న‌లో ర‌ష్య‌న్ మీడియా వెల్ల‌డించే స‌మాచార‌మే పెద్ద దిక్కు.

Advertisement

తాజా ప‌రిణామాల దృష్ట్యా ర‌ష్య‌న్ మీడియాపై ఫేస్‌బుక్‌లో ఆంక్ష‌లు అమ‌లులోకి రానున్నాయి. దీంతో ర‌ష్యాకు సంబంధించిన స‌మాచారం మ‌రింత త‌క్కువ‌గా బ‌య‌టి ప్ర‌పంచానికి వెల్ల‌డి కానుంది. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడిని ఖండిస్తూ ఇటు అమెరికాతో పాటు అటు యూరోపియ‌న్ దేశాలు అనేక క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌క‌టించిన చ‌ర్య‌ల‌న్నీ ప్ర‌భుత్వ ప‌ర‌మైన‌వే ఎక్కువ‌గా ఉన్నాయి. తాజాగా వీటికి ప్రైవేటు కంపెనీలు కూడా క‌లుస్తున్నాయి. తొలుత ఫేస్‌బుక్ త‌రుపున మెటా నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ దారిలో మ‌రిన్నీ ప్రైవేటు కంపెనీలు న‌డుస్తాయా లేదా అన్న‌ది మ‌రికొద్ది రోజుల్లో తేల‌నున్న‌ది.

Also Read :  Video Viral : హెలికాప్ట‌ర్‌కు వేలాడి పుల్ అప్స్ చేసి గిన్నిస్ బుక్ రికార్డు..!

Visitors Are Also Reading